Nagarjuna : అక్కినేని కుటుంబంలో మూడు తరాల హీరోల్లోనూ అఖిల్ టైం ఏం బాగోలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. తాజాగా వచ్చిన ఏజెంట్ భారీ డిజాస్టర్ గా నిలవడంతో అఖిల్ కెరీర్ అయోమయంలో పడింది. కెరీర్ తొలినాళ్లలో భారీ హైప్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్… ఓ స్టార్ హీరో రేంజ్ కు ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ తన కెరీర్లో సరైన కథలు పడకపోవడంతో అథ: పాతాళంలోకి వెళ్లిపోయింది. దీంతో తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సరైన బ్రేకింగ్ హిట్ కావాలి.. లేకపోతే కెరీర్ కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు తన తండ్రి నాగార్జున కొడుకు ఇష్టానికే వదిలేసాడు.
Read Also:BJP MP Passes Away: అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత
కానీ ఇప్పుడు కొడుకు కెరీర్ ప్రమాదంలోకి పడడంతో తానే నేరుగా రంగంలోకి దిగి చక్కదిద్దే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడట. కొడుకు జీవితాన్ని తానే చేతిలోకి తీసుకొని ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళిని కలిసాడట నాగార్జున. అంతేకాదు అఖిల్ తో సినిమా చేయాలని కోరాడట. ఈ మేరకు నాగార్జున రాజమౌళికి పది కోట్ల రూపాయలు అడ్వాన్స్ సైతం ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే అఖిల్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
Read Also:Tahawwur Rana: ముంబయి పేలుళ్ల నిందితుడు రాణాను భారత్‌కు అప్పగించాలని అమెరికా కోర్టు తీర్పు