చంద్రబాబు, లోకేష్ పై దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఉనికిని కోల్పోతోందని ఆరోపించారు. లోకేష్ యువగళం పేరుతో వెళ్లిన ప్రతీ చోటా రెచ్చగొడుతున్నాడని అవినాష్ పేర్కొన్నారు. లోకేష్ రౌడీ షీటర్లు, గూండాలను తయారు చేసే ఫ్యాక్టరీలా టీడీపీని మార్చాడని దుయ్యబట్టారు. రౌడీయిజం, గూండాయిజం, అల్లర్లు చేస్తే పదవులిస్తానని లోకేష్ సిగ్గులేకుండా ఆఫర్లు ఇస్తున్నాడని తెలిపారు. ఏపీలో దొంగతనాలు, గంజాయి, మహిళలపై వేధింపులు, మర్డర్ కేసుల్లో టీడీపీ వాళ్లే ఉంటున్నారని చెప్పారు.
Read Also: G20 Summit 2023 LIVE UPDATES: జీ20 సదస్సు.. ఢిల్లీకి పలు దేశాల అధినేతలు
యువగళం పాదయాత్రకు జనం రాక, నాయకులు లేక.. లోకేష్ యువగళం రౌడీలను రెచ్చగొడుతున్నాడని దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో చంద్రబాబు విధ్వంసం సృష్టిస్తే, భీమవరంలో లోకేష్ అదే విధ్వంసాన్ని కొనసాగించాడని తెలిపారు. విధ్వంసంలో తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. టీడీపీ హయాంలో చేసిన అవినీతి పై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. 118 కోట్ల ముడుపుల పై ఎందుకు ఎవరూ స్పందించరని అవినాష్ ప్రశ్నించారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరని అన్నారు. అమరావతి ల్యాండ్ స్కామ్, టిడ్కో ఇళ్ల స్కామ్, స్కిల్ డెవలప్ మెంట స్కామ్ పై టీడీపీ, చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందని అవినాష్ కోరారు.
Read Also: Asia Cup 2023: ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌కే ఆ ఛాన్స్.. మిగతా మ్యాచ్‌లకు లేనట్టే..!
సీఎం జగన్ తన కుమార్తెల దగ్గరకు వెళితే టీడీపీ సిగ్గులేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతోందని దేవినేని అవినాష్ అన్నారు. గతంలో సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ ట్రిప్పులు చేసింది ఎవరని ప్రశ్నించారు. పంటి నొప్పి వస్తే సింగపూర్ వెళ్లింది ఎవరు.. హోటల్స్ బిజినెస్ కోసం సింగపూర్ వెళ్లింది మీరు కాదా అని ప్రశ్నించారు. సొంత ఖర్చుతో లండన్ వెళ్తే సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు బాండ్ పేపర్లు తీసుకుని వెళ్లేందుకు టీడీపీ నేతలకు సిగ్గుందా అని తీవ్రంగా మండిపడ్డారు. 600 హామీలు ఇచ్చి చేసిన మోసం పై సమాధానం చెప్పండని.. అవినీతి చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని అవినాష్ అన్నారు.