తెలంగాణాలో క్రైం రేటు రోజురోజుకు పెరిగిపోతుంది.. మొన్నటివరకు రోడ్డు ప్రమాదాలతో జనాలు అనేక ఇబ్బందులు పడితే.. నేడు హత్యలు కలకలం రేపుతున్నాయి.. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగడం వల్లో కుటుంబ కలహాల వల్లనో హత్యకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.. క్షనీకావేశంలో జరిగే హత్యలతో కుటుంబాలు విచ్చిన్నం అవుతాయి.. తాజాగా పెద్దపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.. నిద్రిస్తున్న ఓ వ్యక్తి పై కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి అతి కిరాతాకంగా సజీవ దహనం చేశారు.. ఈ దారుణ ఘటన తాజాగా వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి దారుణ హత్య గావించబడ్డారు. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గాలిపెళ్లి అశోక్ దారుణ హత్యకు గురయ్యాడు.. మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు. అశోక్ ను గత 10 రోజుల క్రితమే హత్య చేయడానికి ప్రయత్నం చేశారని, ప్రాణ భయం ఉందని పోలీస్ స్టేషన్ లో అశోక్ ఫిర్యాదు చేశారు.
అశోక్ హత్యను తన కుటుంబ సభ్యులే చేసినట్లు తెలుస్తుంది.. మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు. అతను పది రోజుల క్రితమే బావ, తమ్ముడు, చెల్లెలు పథకం ప్రకారం హత్య చేశారని గ్రామస్తులు అంటున్నారు. అశోక్ మృతికి అస్తి పంపకాలే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అశోక్ బావ అనిల్, తమ్ముడు నరేష్, చెల్లెల్లు పుష్పలతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఈ దారుణ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..