Delhi High Court : ఓ జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ కోరికకు ఢిల్లీ హైకోర్టు షాక్ అయింది. తన పెరోల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీకి ఇప్పటికే జైలులో భార్య, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ, అతను పెరోల్‌పై బయటకు వచ్చి తన లైవ్-ఇన్ భాగస్వామితో సంబంధం కలిగి ఉండాలని కోరుకున్నాడు. అతడు ఆమె నుంచి బిడ్డను కనాలనుకున్నాడు. ఇందుకోసం ఆయన కోర్టులో పెరోల్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దానిని హైకోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. భారతీయ చట్టం, జైలు నియమాలు ఖైదీకి పెరోల్‌ను అనుమతించవని, అది కూడా లైవ్-ఇన్ భాగస్వామితో వివాహ సంబంధాలను కలిగి ఉండడానికి అసలు ఒప్పుకోవని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
Read Also:Giri Raja Singh: మణి శంకర్ వ్యాఖ్యల పై కేంద్ర మంత్రి గిరిరాజ్ ఫైర్..
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ గురువారం కేసు విచారణ సందర్భంగా.. చట్టం, జైలు నిబంధనల పరిధిలో తన లివ్-ఇన్ భాగస్వామితో బిడ్డను కనడం తన ప్రాథమిక హక్కు అని ఏ వ్యక్తి క్లెయిమ్ చేయలేరని అన్నారు. పైగా తన భార్య జీవించి ఉన్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. లైవ్-ఇన్ భాగస్వామిని పక్కన పెట్టండి… చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యతో సంబంధాలు పెట్టుకునేందుకు పెరోల్ మంజూరు చేయడానికే ప్రస్తుత చట్టం అనుమతించదని కోర్టు పేర్కొంది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న తన భార్య కాదని.. అతను అప్పటికే వేరొకరితో సహజీవనం చేస్తున్నాడు. ఆ వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పైగా ఆ మహిళ సదరు వ్యక్తిని విడాకులు కూడా తీసుకోలేదు.
Read Also:Kakarla Suresh: పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి విశేష స్పందన..!