Rahul Gandhi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ఉన్నావ్ అత్యాచారం’’ కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. సెంగార్ ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్ని, జైలు శిక్షను సవాల్ చేశాడు. హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఇప్పటికే 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పూర్తి చేయడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మధ్య కాలంలో డీప్‌ఫేక్ టెక్నాలజీతో సెలబ్రిటీల ఫోటోలను మార్చేసి నెట్టింట రచ్చ చేస్తున్నారు. అసలు నిజమేంటో తెలియక జనం కూడా అది చూసి మోసపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నటినటులు దీని బారిన పడగా.. తాజాగా ఇలాంటి ఫేక్ కంటెంట్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి నటుడు మాధవన్ ఇప్పుడు సీరియస్ అయ్యారు. తన పర్మిషన్ లేకుండా తన పేరును, ఫోటోలను వాడుకుంటూ కొన్ని వెబ్‌సైట్లు అశ్లీల కంటెంట్‌ను తయారు చేస్తున్నాయని మాధవన్ ఢిల్లీ హైకోర్టులో…
టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ అనుమతి లేకుండా పేర్లు, ఫోటోలు వాడటాన్ని నిలువరించాలని కోరుతూ ఈ ఇద్దరు హీరోలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ పేరు, ప్రతిష్ఠను వాణిజ్య ప్రయోజనాల కోసం అనధికారికంగా ఉపయోగించడం చట్టవిరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకటనలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఇతర ప్రచార కార్యక్రమాల్లో అనుమతి లేకుండా ఫోటోలు, పేర్లు వాడటాన్ని తక్షణమే ఆపాలని వారు కోర్టును కోరారు. Also Read : BMW…
Cash-for-Query Case: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన లోక్‌పాల్ ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది.
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి గందరగోళం ఎందుకు తలెత్తిందంటూ తీవ్రంగా మందలించింది. ఇక ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఎలా అనుమతించబడ్డాయని న్యాయస్థానం నిలదీసింది.
టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదుల మేరకు కీలకమైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫిర్యాదులపై సోషల్ మీడియా మరియు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం, ఈ ప్లాట్‌ఫామ్స్ మూడు రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్…
Supreme Court: గురుద్వారాలో ప్రవేశించడానికి, పూజ చేయడానికి నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ అధికారిని తొలగించిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. ‘‘అతను ఆర్మీకి పనికి రాడు’’ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. అతడిని అసమర్థుడిగా ముద్ర వేసింది. తన తొటి సిక్కు సైనికులు విశ్వాసాన్ని గౌరవించనందుకు అతడిని తొలగించిన ఆర్మీ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
ఈ ప్రకృతిలో తల్లి, బిడ్డల ప్రేమ వర్ణించలేనిది. జంతువుల్లోనైనా.. మానవ జాతిలోనైనా పేగు బంధం అపురూపమైనది. ఇది మాటల్లో వర్ణించలేనిది. ఈ సృష్టిలో అంత అద్భుతమైంది ఈ బంధం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
Delhi High Court: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్నేహాన్ని అత్యాచారానికి లైసెన్సుగా పరిగణించలేమని, లైంగిక వేధింపులు, నిర్భంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా ఉపయోగించలేమని పేర్కొంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిందితుడికి బెయిల్‌ను నిరాకరించారు.