Delhi Blast 2025: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తులో వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాజాగా ఢిల్లీ కారు పేలుడులో PAF పేరు బయటపడింది. ఇప్పటికే ఈ బాంబు పేలుడు కేసు NIAకి అప్పగించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఈ కారు పేలుడులో ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ పేలుడు వెనుక ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ అని చెబుతున్నారు. ఉమర్ వృత్తిరీత్యా వైద్యుడు, ఇతను ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాడు.
READ ALSO: World’s Billionaires List: ఈ 10 దేశాలలో భారత్ కంటే ఎక్కువ ధనవంతులు.. ఏయే దేశాలంటే?
PAFF సంబంధంపై ముమ్మర దర్యాప్తు
ఈలోగా దర్యాప్తు సంస్థలు అనేక ఇతర ఆధారాలు సేకరించాయి. ఈ సంఘటనతో PAFF సంబంధంపై నిఘా సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. వాస్తవానికి PAFF అంటే పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ అని అర్థం. ఇది ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ నీడ సంస్థ అని చెబుతారు. లష్కరే తోయిబా TRF పేరుతో పనిచేస్తున్నట్లే, ఇది జమ్మూ & కాశ్మీర్‌లో PAFF పేరుతో పనిచేస్తుంది.
పలు కథనాల ప్రకారం.. PAFF ప్రతినిధి తన్వీర్ అహ్మద్ రాత్రే పలు సందర్భాల్లో భద్రతా దళాలపై జరిగిన దాడి తర్వాత పత్రికా ప్రకటనలు జారీ చేశాడు. వాస్తవానికి అతని అసలు పేరు తన్వీర్ అహ్మద్ రాత్రే కాదని భద్రతా సంస్థలు చాలా కాలంగా అనుమానిస్తున్నాయి. ఈ పత్రికా ప్రకటనలు జారీ చేస్తున్న వ్యక్తి వైద్యుడు లేదా మనస్తత్వవేత్త అని కూడా భద్రత సంస్థలు అనుమానించాయి. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథోడ్‌ను ప్రశ్నిస్తున్నాయి. అతను తన్వీర్ అహ్మద్ రాథోడ్ అయి ఉండవచ్చనే అనుమానం ఉందని పలువురు భద్రతా అధికారులు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ ఆదిల్ లాకర్ నుంచి AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు, CCTV ఫుటేజ్‌లో అతను జైష్ పోస్టర్‌లను అంటించడాన్ని గుర్తించారు. ఏజెన్సీలు ఇప్పుడు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాయి. అతను PAFF యొక్క సూత్రధారినా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని నిఘావర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత TRF పేరు బయటకు వచ్చింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే TRF దాడికి బాధ్యత వహించింది, కానీ తరువాత దాని పోస్ట్‌ను తొలగించింది.
READ ALSO: IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్‌లు ఇవే!