Delhi Blast 2025: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తులో వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాజాగా ఢిల్లీ కారు పేలుడులో PAF పేరు బయటపడింది. ఇప్పటికే ఈ బాంబు పేలుడు కేసు NIAకి అప్పగించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఈ కారు పేలుడులో ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ పేలుడు వెనుక ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ అని చెబుతున్నారు.…
Masood Azhar: సోమవారం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబ్ దాడితో దేశం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోసారి కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ పేరు వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.