Indigo flight: విమానం 2 గంటలు ఆలస్యం.. ఏసీ పనిచేయక అల్లాడిపోయని ప్రయాణికులు
- ఢిల్లీలో విమానం 2 గంటలు ఆలస్యం
- ఏసీ పనిచేయక అల్లాడిపోయని ప్రయాణికులు
- ఇండిగో విమాన సంస్థపై ప్యాసింజర్స్ ఆగ్రహం
- క్షమాపణ చెప్పిన విమానయాన సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే హస్తినలో అధిక ఉష్ణోగ్రతలు.. ఇంకోవైపు కరెంట్ కోతలు.. మరోవైపు తాగునీటి కష్టాలు.. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం రెండు గంటలు ఆగిపోయింది. ఒకవైపు ఉక్కపోత.. ఇంకోవైపు వేడిగాలులు. దీంతో విమానం లోపల ఏసీ లేక ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఇక పిల్లలు, వృద్ధులైతే హడలెత్తిపోయారు. ఈ బాధలను భరించలేక ప్రయాణికులు మొబైల్‌లో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానం 2 గంటలు ఆలస్యం అయింది. విమానం మధ్యాహ్నం 2:10 గంటలకు బయలుదేరి 4:10 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానం విమానాశ్రయంలోని టార్మాక్‌పై రెండు గంటలు నిలిచిపోయింది. లోపలేమో ఏసీ లేదు. దీంతో ఉక్కపోతతో ఊపిరాడక ప్యాసింజర్స్ అల్లాడిపోయారు. ఇదిలా ఉంటే బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన దగ్గరలోనే బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టు ఉంది. సాంకేతిక కారణంతోనే ఫ్లైట్ ఆలస్యం అయిందని సిబ్బంది పేర్కొ్న్నారు. ఒకసారి ఇంజన్ సమస్య అని.. ఇంకోసారి ఇంధన సమస్య అని చెప్పారు. ఇలా సిబ్బంది తికమక సమాధానాలతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాగ్డోగ్రా విమానాశ్రయం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో ఉంది.
ఇది కూడా చదవండి: Yuva Rajkumar: యువ రాజ్‌కుమార్కి లైంగిక సమస్యలు.. హోటల్లో నటితో రెడ్ హ్యాండెడ్ గా దొరికి?
ఇక ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణ చెప్పింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. గమ్యానికి చేరేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Gujarat: రైల్వే ట్రాక్పై సింహాలు.. ట్రైన్ ఆపి రక్షించిన లోకో పైలట్
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..