Sridevi Byrappa Response to Yuva Rajkumar Divorce Notice:’యువ’ సినిమాతో హీరోగా శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన యువ రాజ్‌కుమార్. ‘యువ’ విడుదలై కొన్ని నెలలయింది. ఇంతలో యువ రాజ్ కుమార్ కుటుంబం నుంచి సంచలన వార్త ఒకటి తెరమీదకు వచ్చింది. డా.రాజ్ కుమార్ కుటుంబంలో విడాకుల కేసు తెరమీదకు రావడం ఇదే తొలిసారి. యువ రాజ్‌కుమార్ విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. నిజానికి యువ రాజ్‌కుమార్, శ్రీదేవి భైరప్ప ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐదేళ్లుగా ప్రేమించుకున్న వీరు 2019లో పెళ్లి చేసుకున్నారు. గత జూన్ 6న యువరాజ్ కుమార్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడాకుల కేసుకు సంబంధించి శ్రీదేవికి లీగల్ నోటీసులు వచ్చాయి. లీగల్ నోటీసుకు శ్రీదేవి తన లాయర్ ద్వారా సమాధానమిచ్చింది. యువరాజ్‌కుమార్ చేసిన ఆరోపణలపై శ్రీదేవి దీటుగా స్పందించారు. అంతే కాకుండా యువ రాజ్ కుమార్ పై కూడా శ్రీదేవి భైరప్ప తీవ్ర ఆరోపణలు చేశారు.
Payyavula Keshav: రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు కూలీగా పని చేస్తా..
ఇంతకీ, లీగల్ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో శ్రీదేవి భైరప్ప చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏమిటి? అనేది చూద్దాం పదండి. “మీ క్లయింట్ (యువ రాజ్‌కుమార్) ప్రవర్తన చూసి నా క్లయింట్ (శ్రీదేవి భైరప్ప) చాలా షాక్ అయ్యారు. శ్రీదేవి భైరప్ప యువ రాజ్‌కుమార్‌ను చట్టబద్ధంగా పెళ్లాడిన భార్య. గత 9 సంవత్సరాలుగా, యువ రాజ్‌కుమార్ మరియు కుటుంబానికి మేలు చేయడానికి శ్రీదేవి చాలా చేసింది. వైవాహిక జీవితంలో మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా వేధించినా శ్రీదేవి కుటుంబ మేలు గురించి ఆలోచించింది. డిసెంబర్ 2023లో, శ్రీదేవి యుఎస్ నుండి బెంగళూరు వచ్చినప్పుడు, యువ రాజ్‌కుమార్‌కు ఒక నటితో ఎఫైర్ ఉందని తెలిసింది. ఇద్దరూ హోటల్ గదిలోనే రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. యువ రాజ్‌కుమార్ నటితో గత ఏడాది కాలంగా ఎఫైర్ నడుపుతున్నట్లు శ్రీదేవి భైరప్పకు తెలిసింది. శ్రీదేవి భైరప్పకి తన భర్త ఎఫైర్ గురించి తెలియగానే పెద్ద షాక్ తగిలింది. హార్వర్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివే సమయంలో శ్రీదేవి తన భర్త వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
నటి యువరాజ్‌కుమార్ ఇంటికి రావడం ప్రారంభించిన తర్వాత శ్రీదేవి భైరప్పను ఇంటి నుండి బయటకు పంపారు. చాలా సందర్భాలలో, శ్రీదేవి యువ రాజ్‌కుమార్, ఆమె కుటుంబం వలన హింసకు గురయ్యారు. ఆ దంపతులకు ఇంకా పిల్లలు లేరన్నది నిజం. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ఉద్దేశం శ్రీదేవికి లేదు. అలా అయితే, శ్రీదేవి యుఎస్ వెళ్ళే ముందు యువ రాజ్ కుమార్ కుటుంబంతో ఉండేది కాదు. శ్రీదేవికి దురుద్దేశం ఉంటే యువ రాజ్‌కుమార్ ఇంట్లో కోట్లాది రూపాయల సామాన్లు పెట్టి ఉండేది కాదు. యువ రాజ్‌కుమార్‌కు లైంగిక సమస్యలు ఉన్నాయి “డా. రాజ్‌కుమార్ అకాడమీ” మరియు “డా. రాజ్‌కుమార్ లెర్నింగ్ యాప్” శ్రీదేవి ద్వారా ప్రారంభమయ్యాయి. రెండు సంస్థలు భాగస్వామ్యంతో నడుస్తున్నాయి. యువ రాజ్‌కుమార్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా కూడా పెళ్లికి ముందే సంస్థలను ప్రారంభించి కుటుంబానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది శ్రీదేవి . శ్రీదేవి విదేశాలకు వెళ్లినా ఆ నటితో ఎఫైర్ కొనసాగించవచ్చన్నది అతని ఉద్దేశం’’ అని శ్రీదేవి తరఫు లాయర్ నోటీసులో పేర్కొన్నారు.