ప్రయాణికులకు ఇండిగో సృష్టించిన సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలకు సిద్ధపడింది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో సమావేశం తర్వాత చర్యలకు పూనుకుంది. ఇండిగో సంక్షోభానికి కారణమైన నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్లను తొలగించింది.
పేదలకు ఇళ్లు ఇవ్వని కేసీఆర్.. 2 వేల కోట్లతో గడీ మాత్రం కట్టుకున్నాడు.. దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా రూ.2 వేల కోట్లతో గడీ కట్టుకున్నారని కేసీఆర్‌పై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ రెండు కళ్లంటూ సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కనీసం అనేక పేదల పేర్లు రేషన్…
విమాన ప్రయాణాల్లో 20 ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభం భారత్ ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. మునుపెన్నడూ లేని కష్టాలు ప్రయాణికులు పడుతున్నారు.
విమాన ప్రయాణం అంటేనే ఎమర్జెన్సీ ఉన్నవారే బుక్ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు.. పెళ్లిళ్లు.. సమావేశాలకు వెళ్తుంటారు. పైగా డిసెంబర్, జనవరి సీజన్ అంటేనే ఎక్కువ ప్రయాణాలుంటాయి.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. 222 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. దీంతో, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలెట్.. విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు..
దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాన్ సృష్టించిన బీభత్సానికి ఇండిగో విమానం అల్లకల్లోలానికి గురైంది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
వైద్యులు.. దేవుడితో సమానం అంటారు. దేవుడు మనిషిని చేస్తే.. వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టేది డాక్టర్లు. అందుకే రోగులు.. వైద్యులకు దండాలు పెడతారు. దేవుడితో సమానంగా చూస్తారు కాబట్టే.. అంతగా వారిని గౌరవిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
భారతీయ రైళ్లలో విక్రేతలు తిరుగుతూ.. ప్రయాణికులకు టీ అమ్మడం చూసే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఇండిగో విమానంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి విమానంలో తిరిగి ప్రయాణికులకు డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ అందిస్తున్నాడు. అంతే కాకుండా రైళ్లో మాదిరిగానే "చాయ్.. చాయ్.." అంటూ అరుస్తున్నాడు.
ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న ఇండిగో విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడి ఆరోగ్యం క్షీణించింది.