అసలే హస్తినలో అధిక ఉష్ణోగ్రతలు.. ఇంకోవైపు కరెంట్ కోతలు.. మరోవైపు తాగునీటి కష్టాలు.. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం రెండు గంటలు ఆగిపోయింది.
బుధవారం పాట్నా నుంచి పుణె వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఇంతలో తన అమ్మమ్మ చనిపోయిందని పైలట్‌కు సమాచారం అందింది. అమ్మమ్మ మృతితో మనస్తాపానికి గురైన పైలట్ విమానాన్ని నడపలేదు. దీని తర్వాత విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ సిబ్బందిని పిలిచింది. ఈ క్రమంలో విమానం దాదాపు మూడు గంటల తర్వాత ఆలస్యంగా బయలు దేరింది.