కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ అక్రమాలపై నిరసన దీక్ష చేపట్టిన విద్యార్థులతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన వర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, తదితరులతో చర్చించారు.. అనంతరం విద్యార్థుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిమ్మరసం తాగించి నిరసన దీక్ష విరమింపజేశారు. ఈ నేపథ్యంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేయూ పీహెచ్డీ సమస్యను కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని చూశాయన్నారు. విద్యార్థుల సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, మంత్రి కూడా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సానుకూలంగా స్పందించారన్నారు దాస్యం వినయ్ భాస్కర్.
Also Read : Regina Cassandra: బంఫర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
అంతేకాకుండా.. విద్యార్థులు కోరిన విధంగా లింబాద్రి, వాకాటి కరుణతో మాట్లాడుతామని, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే.. న్యాయం జరగకపోతే మళ్లీ ఉద్యమిస్తామని కేయూ స్టూడెంట్ జేఏసీ, పీహెచ్డీ అభ్యర్థి, కేయూ స్టూడెంట్ జేఏసీ నేత రాంబాబు అన్నారు. పీహెచ్డీ సమస్యను విన్న మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పి.. వారం రోజుల టైమ్ అడిగారని, మేం ప్రభుత్వానికి 10 రోజుల టైమ్ ఇస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హామీ మేరకు నిరసన దీక్షకు 10 రోజులు విరామ ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. 10 రోజుల తర్వాత కూడా సమస్య పరిష్కరించకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని, అర్హులైన వాళ్లందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు.
Also Read : MP Arvind: వందశాతం కాంగ్రెస్ బీ-ఫాంలు కేసీఆరే పంచుతున్నారు..