తొమ్మిదేళ్ళ కల్వకుంట్ల పాలన చూసి తెలంగాణ ప్రజలు విసుగు చెందారు అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణకు కేంద్రం చేయాల్సింది అంత చేసింది.. అవినీతి ఆరోపణలు లేకుండా తొమ్మిదేళ్ళ పాలన మోడీ అందించారు.. ఇండ్లు, స్కాలర్ షిప్స్, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేసింది.. కేసిఆర్ ను ఓడించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారు.. కేసిఆర్ చేసిన ప్రతి పథకంలో అవినీతి ఉంది.. 30 శాతం కమీషన్ల ప్రభుత్వం.. తెలంగాణలో ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Gunnies Records : పేకముక్కలతో అద్భుతమైన కోటను నిర్మించిన యువకుడు.. వావ్ అదిరిపోయింది..
తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం అనేక మొలు చేసే పనులు చేశారు అని ధర్మపురం అర్వింద్ అన్నారు. అందరూ ముఖ్య నేతలు అసెంబ్లీకి పోటీ చేస్తారు.. ఎన్ని సీట్లు వచ్చిన మేమే అధికారంలోకి వస్తాం.. కేసిఆర్ తో కలిసి వెళ్ళము.. వంద శాతం కాంగ్రెస్ బీ-ఫాంలు కేసిఆర్ యే పంచుతున్నారు.. కాంగ్రెస్ కి డబ్బులు పంచేది కేసిఆర్ యే.. కేసిఆర్ తో పోరాడేది బీజేపీనే అని ఆయన చెప్పుకొచ్చారు. NDA లోకి కేసిఆర్ ను రానియ్యలేదు మోడీ.. కేటీఆర్ ను సీఎం కానివ్వలేదు మోడీ.. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమని ఆదేశించిన చేస్తా అని ధర్మపురి అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భయపడి నిజామాబాద్ పార్లమెంట్ లోని ఏ అసెంబ్లీ స్థానం జోలికి రాదు అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ సారి పసుపు రైతులు నాకే ఓటు వేస్తారు.. కవిత కోరుట్లలో పోటీకి వస్తా అంటే ఆహ్వానిస్తాం.. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు కిషన్ రెడ్డిని అడగాలి అని ఆయన తెలిపారు.