ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే పోరాటం చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోందని, ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయడం లేదనే అపోహను తొలగించాలన్నారు. పేదలకు సంక్షేమం అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ఆమె చెప్ప్పుకొచ్చారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… ’50 రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవు. ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోంది. ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పింది. రాబోయే ఎన్నికల్లో అధికార ప్రతినిధులే ప్రధాన భూమిక పోషించాలి. జాతీయ స్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయడం లేదని అపోహను తొలగించాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని కార్యకర్తను ఉద్దేశించి అన్నారు.
Also Read: Chiranjeevi: రమణ గాడి ఇంటికి విశ్వంభర
‘రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. పేదలకు సంక్షేమ అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తుంది. కేవలం ఒక తిరుపతి నియోజకవర్గంలోనే 30 వేల దొంగ ఓట్లున్నాయి. ప్రజా సమస్యలపై రాష్ట్రంలో బీజేపీ పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన పార్టీగా ఎదుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేస్తోంది’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.