ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే పోరాటం చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోందని, ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయడం…