అదేంటి ఈ రమణ ఎవరు? ఆయన ఇంటికి విశ్వంభర వెళ్లడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. అసలు విషయం ఏమిటంటే మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మహేష్ పేరు రమణ. తనను తాను రమణ గాడిగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సినిమాలో మహేష్ కి ఒక బంగ్లా ఉంటుంది. తన తండ్రి సహా తన మమయ్యలతో కలిసి అందులో మహేష్ నివసిస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు అదే ఇంట్లో విశ్వంభర షూట్ జరుగుతోంది. చిరంజీవి హీరోగా బింబీసార దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది.
Also Read: Ananya Nagalla : అలాంటి సీన్స్ చేసే విషయంలో నా మనసు మార్చుకున్నాను..
ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. ఆ సాంగ్ షూట్ ఇప్పుడు గుంటూరు కారం మహేష్ బాబు ఇంటి సెట్ లో చేస్తున్నారు అని తెలుస్తోంది. చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ సినిమాలో కీలకం అని తెలుస్తోంది. ఇక ఈ సెట్ హైదారాబాద్ శివార్లలో ఉందని తెలుస్తోంది..ఇక కొద్దిరోజుల క్రితం వరకు ఇదే సినిమా షూటింగ్ నల్గొండ జిల్లాలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైస్ మిల్ లో జరిగింది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను జనవరి 10 2025న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.