తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉచిత ఇసుక అమ్మకాలను రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ప్రారంభించారు. రాజమండ్రి లాలాచెరువు స్టాక్ పాయింట్ వద్ద క్యూ కట్టారు ఇసుక వినియోగదారులు. టన్ను ఇసుక ధర 270 రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా కేవలం నిర్వహణ ఖర్చులు చట్టబద్ధమైన పనులు మాత్రమే వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండు లక్షల వరకు జరిమానా రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం.
ఉచిత ఇసుకకు సంబంధించి స్టాక్ పాయింట్లు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన ఇసుక దోపిడీకి ముసుగు తొలగించామని ఆమె వ్యాఖ్యానించారు. పారదర్శకంగా ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ ఉంటుందని, నిన్నటి వరకు జరిగిన ఇసుక దోపిడీతో మాకు సంబంధం లేదన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రజలకు హితమైన స్వప్న ఉచిత ఇసుక పాలసీ ఏర్పాటు సంతోషిస్తున్నామని, గత ప్రభుత్వ హాయంలో జరిగిన ఇసుక అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు పురంధేశ్వరి. మరింత మెరుగైన పాలసీ భవిష్యత్తులో వస్తుందని ఆశిస్తున్నామన్నారు.