Auto Driver Rules: నగరాలు, పట్టణాలు లేదా ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో ఆటో లను ఉపయోగించడం సర్వసాధారణం. అయితే ఇలా ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆటోడ్రైవర్లు వారి ఆటో లోపల వర్రీ అభిరుచికి తగ్గట్టుగా కొన్ని కొటేషన్స్, పెయింటింగ్స్, ఫొటోస్ ను ఆటోలో ఉంచడం మామూలే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆటోలో ఉన్న ఫోటో సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇందులో ఓ ఆటో డ్రైవర్ తన ఆటో ఎక్కే ప్యాసింజర్లకు కాస్త ఘాటుగానే రూల్స్ ప్రిపేర్ చేసి అందుకు సంబంధించిన ఓ కాగితాన్ని ఆటోలో వచ్చాడు. ఆటోలో ఉంచిన ఫోటోను ఆటో ఎక్కిన ప్యాసింజర్ ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే అసలు ఆ ఫోటోలో ఏం రాసిందన్న విషయానికి వెళ్తే..
Milkshake vs Fruit Juice: మిల్క్ షేక్ లేదా ఫ్రూట్ జ్యూస్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
ఆటో డ్రైవర్ తన ఆటో ఎక్కే ప్రతి ఒక్క కస్టమర్ కి ఆ రూల్స్ వర్తించేలా రూపొందించాడు. ఇందులో మొత్తం ఏడు పాయింట్లు ఉంచాడు. ఆ ఏడు పాయింట్లు ఏంటంటే..
* మీరు క్యాబ్ యజమాని కాదు.
* క్యాబ్ నడుపుతున్న వ్యక్తి యజమాని.
* మర్యాదగా మాట్లాడండి. గౌరవం పొందండి.
* తలుపును నెమ్మదిగా మూసివేయండి.
* మీ యాటిట్యూడ్ను మీ జేబులో ఉంచండి. దయచేసి దానిని మాకు చూపవద్దు. మీరు మాకు ఎక్కువ డబ్బు చెల్లించడం లేదు.
* మమ్మల్ని అన్నయ్య అని పిలవకండి.
* గమనిక: వేగంగా డ్రైవ్ చేయమని అడగవద్దు.
Israeli Air Strikes: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు..
ఇలా తన స్టైల్ లో రూల్స్ ను ప్రిపేర్ చేసి దానిని తన సీట్ వెనుక భాగంలో అతికించాడు. ముఖ్యంగా ఇందులో ” మీ యాటిట్యూడ్ను మీ జేబులో ఉంచండి. దయచేసి దానిని మాకు చూపవద్దు. మీరు మాకు ఎక్కువ డబ్బు చెల్లించడం లేదు.” అనే లైన్ కు సోషల్ మీడియా వినియోగదారులు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.