క్రికెట్ ఆటపై వున్న క్రేజ్ నేపథ్యంలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ రాజ్యమేలుతోంది. కోట్లాదిరూపాయలు బెట్టింగ్‌ల రూపంలో చీకటి వ్యాపారం సాగుతూ వుంటుంది. తాజాగా క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ ల కు అండగా ఉన్నాడు అమిత్ గుజరాతి.ఇతర రాష్ట్రంలో అమిత్ గుజరాతిని వల పన్ని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు.
అమిత్ గుజరాతిని పీటీ వారెంట్ మీద హైదరాబాద్ కు తీసుకొని రానున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ కోసం పెద్ద నెట్ వర్క్ కలిగి ఉన్నాడు అమిత్ గుజరాతి. ఇప్పటివరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు అమిత్ గుజరాతి. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతుంటాడు అమిత్ గుజరాతి.
గత కొన్నేళ్ళుగా బెట్టింగులు నిర్వహిస్తూ కోట్లు కొల్లగొట్టింది అమిత్ గ్యాంగ్. పక్కా ఇన్ఫర్మేషన్ తో బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు అమిత్ గుజరాతీని నేడు కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు. అమిత్ గుజరాతీని పోలీసు కస్టడీలోకి తీసుకుంటే బెట్టింగ్ కు సంబంధించి డొంకంతా కదులుతుందని భావిస్తున్నారు.
Swaroopananda: గొప్ప నారసింహక్షేత్రం సింహాచలం