నల్లగొండ జిల్లాలోని దేవరకొండ మండలం పడమటిపల్లిలో సీపీఐ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు.. బీజేపి విమోచన, విముక్తి దినం అంటూ.. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pipe Line Burst in Visakhapatnam: పైప్ లైన్ లీక్.. పాతాళగంగలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ నీరు
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తప్పించడం కోసం కేసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లొంగిపోయాడు అంటూ సీపీఐ నారాయణ విమర్శించారు. ప్రతిపక్షాలు బలపడకుడదనే మోడీ జమిలి ఎన్నికలు అంటున్నాడు.. ఇప్పుడు మినీ జమిలికి సిద్దం అవుతున్నాడు.. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన బడా వ్యాపారుల్లో ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళే.. బీజేపీ, మోడీ చెప్పే సనాతన ధర్మంలో మహిళలకు స్వేచ్ఛ ఉండదు అని ఆయన తెలిపారు.
Read Also: Umapathy Ramaiah: స్టార్ హీరో కుతూర్ని లవ్లో పడేసి ఏకంగా హీరో అయిపోయిన కమెడియన్ కొడుకు
సనాతన ధర్మం అంటే రాచరిక పాలన కంటే ఇంకా వెనక్కు వెళతామని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. కూతురు కోసం ఒకరు, కేసుల నుంచి తప్పించుకోవడం మరొకరు ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు మోడీకి దగ్గరయ్యారు అంటూ ఆయన సెటైర్ వేశారు. ఇక, ఎమ్మెల్సీ కవితపై నారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కవితకి ఈడీ అధికారులు నోటీసులు పంపిస్తే.. కోర్టు నీకు వీలైనప్పుడు రా అని చెప్పింది.. వంకాయలు.. బెండకాయలు కోసేది ఉందా?.. నేను బిజీ అని కవిత చెప్పగానే కోర్టు నమ్మింది.. మోడీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా?.. బీజేపీ, బీఆర్ఎస్ బంధం బలంగా ఉంది అనడానికి ఇంతకు మించి నిదర్శనం ఏముంది అని సీపీఐ నారాయణ అన్నారు.