Crocodile Kills Costa Rican Footballer While Swimming In A River: మొసలి దాడి చేయడంతో ఓ ఫుట్‌బాల్ ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోస్టారికాలో చోటుచేసుకుంది. 29 ఏళ్ల ఫుట్‌బాల్ ఆటగాడు జీసస్ ఆల్బర్టో లొపేజ్ ఓర్టిజ్‌పై నదిలో మొసలి దాడి చేసింది. ఓర్టిజ్‌ను నీళ్లలోకి లాకెళ్లి దాడి చేయడంతో అతడు మరణించాడు. జులై 29న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రియో కానస్ క్లబ్‌కు లోపెజ్ ఆడుతున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కోస్టారికా రాజధాని శాంతా క్రూజ్ నగరానికి సమీపంలోని కనాస్ నది మొసళ్లకు ప్రసిద్ధి. మొసళ్లు ఉన్నాయనే కారణంతోనే.. ఆ నదిలో ఈత కొట్టడాన్ని నిషేధించారు. ఈ విషయం తెలిసి కూడా ఫిషింగ్ బ్రిడ్జి సమీపాన ఫుట్‌బాల్ ఆటగాడు లోపెజ్ ఓర్టిజ్ ఎక్సర్ సైజులు చేశాడు. ఆపై ఈత కొట్టేందుకు నదిలో దూకాడు. ఓర్టిజ్ నదిలో దూకగానే ఓ మొసలి దాడి చేసింది. ఆపై ఒర్టిజ్‌ను నోట కరుచుకుని మొసలి నీళ్లలోకి లాక్కెళ్లింది.
లోపెజ్ ఓర్టిజ్ శవాన్ని మొసలి నోట కరుచుకుని నీళ్లలో తిరిగింది. ఒర్టిజ్‌ను మొసలి లాక్కెళ్తున్న భయానక ద్రుశ్యాలను చూసిన స్థానికులు భయపడిపోయారు. చివరకు మొసలిని తుపాకీతో కాల్చి చంపి.. మృతదేహాన్ని బయటికి తీశారు అధికారులు. ఓర్టిజ్ మరణంతో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగింది. డిపోర్టివో రియో కేనస్ క్లబ్ తరపున ఒర్టిజ్ ఆడుతున్నాడు. కోస్టారికా అస్కెన్సో లీగ్ టీమ్ సభ్యుడు కూడా.
Also Read: Etela Rajender: గవర్నర్‌పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు: ఈటల