Covid Cases: భారత్ లో కరోనా వైరల్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా యొక్క కొత్త వేరియంట్ జెన్.1తో ప్రజలలో భయాందోళన సృష్టించింది. ఇదిలా ఉండగా.. రోజు రోజుకి కోవిడ్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఇవాళ రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేయనున్నారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో సహా పలువురు ఇందులో పాల్గొంటారు. ఆరోగ్య సదుపాయాల కల్పిన, అంటువ్యాధుల నివారణ చర్యలపై ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
Read Also: TSRTC New Record: ఆర్టీసీ సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే 51.74 లక్షల మంది ప్రయాణం
కాగా, కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 115 కొత్త కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కేళరలో రోగుల సంఖ్య 1,749కి చేరుకోగా.. మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్‌లలో కూడా కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్రలో జెన్.1 కొత్త వేరియంట్ 18, గోవాలో 18 కేసులు నమోదు అయ్యాయి. ఇక, దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 1970కి చేరుకుంది. గత 9 రోజుల్లో కరోనా సోకిన వారి సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇవాళ దేశంలో కొత్త 142 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అంటువ్యాధుల నివారణకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో రెడీగా ఉంది. ఇన్‌ఫెక్షన్ లక్షణాలున్న వ్యక్తులను వెంటనే పరీక్షించాలని ఆయన సూచించారు.