TSRTC New Record: ఆర్టీసీ సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే 51.74 లక్షల మంది ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC New Record: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి అయినా ఫ్రీగా ప్రయాణించవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా మహిళలు బస్సుల్లో ప్రయాణించడం పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో బస్సుల రాకపోకలు పెరిగిపోయి నిలబడే పరిస్థితులు లేవు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (డిసెంబర్ 19) రికార్డు స్థాయిలో 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. పాస్ హోల్డర్లు మినహా 48.5 లక్షల మందికి ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసింది.
Read also: Congress: జనవరి 2024లో భారత్ జోడో యాత్ర 2.0ని ప్రారంభించే ఛాన్స్..
Also Read
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
వీరిలో 30.16 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు, మొత్తం ప్రయాణీకులలో కేవలం 40 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి చేరుకుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న రీయింబర్స్‌మెంట్‌తో కలిపి ఒక్కరోజులోనే రూ.21.10 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ఆర్టీసీ జోన్ల పరిధిలో సోమవారం బస్సులు 33.36 లక్షల కి.మీ. కరీంనగర్ జోన్‌లో గరిష్టంగా 14.49 లక్షల కిలోమీటర్లు, హైదరాబాద్ జోన్‌లో 10.93 లక్షల కిలోమీటర్లు, గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 7.94 లక్షల కిలోమీటర్ల మేర తిరిగినట్లు వెల్లడించారు.
CM Revanth Reddy: హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!