Maharashtra: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర చవాన్ మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం వెల్లడించారు. ఈ విషయమై ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకుడిగా కిరణ్ రిజిజూ హాజరైనట్లు ఆయన వెల్లడించారు. రవీంద్ర చవాన్ నామినేషన్ దాఖలు చేయడానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి…
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ ఆరోపించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం కిరణ్ రిజిజుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ పనితీరుకు సంబంధించిన 188వ నిబంధన కింద రమేష్ ఈ నోటీసు ఇచ్చారు.
Hyundai : హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆర్థికంగా బలహీనమైన పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందజేసింది. హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద కంపెనీ ఈ స్కాలర్‌షిప్‌ను అందించింది.
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడి కథ సుఖాంతం అయింది. తరోన్ ని ఎట్టకేలకు చైనా బలగాలు భారత సైన్యానికి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ళ బాలుడు తరోన్ ఈ నెల 19 నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల చైనా బలగాలు తరోన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ దీనిపై స్పందించారు. సరిహద్దు ప్రాంతంలో మూలికల…
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే సిద్ధార్ద్ చేసిన ట్విట్‌ను డిలీట్ చేయాలని.. అతడిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రత అంశంలో బీజేపీని విమర్శిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌కు సైనా నెహ్వాల్ రిప్లై ఇచ్చింది. ప్రధాని భద్రతకు విఘాతం కలిగిస్తే ఏ దేశం కూడా సురక్షితంగా ఉందని చెప్పుకోదంటూ పేర్కొంది. దీంతో సిద్ధార్థ్…
ప్రతి ఏడాది దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా నిర్వహించడం వలన అధికవ్యయం అవుతున్నది. అంతేకాకుండా అభివృద్ది సైతం కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఒకేసారి ఖర్చు చేస్తే సరిపోతుంది. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం నిధులు కేటాయిస్తే, రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఆయా రాష్ట్రాలు నిధులు సమకూర్చుకోవాలి. అదే అన్ని ఎన్నికలు…