Tamarind Seeds: చింత గింజలు.. మనలో చాలామంది ఇవి ఎందుకు పనిరావని పడేసేవాళ్లే ఎక్కువ. కానీ నిజానికి చింత గింజలు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలామందికి వీటి ఉపయోగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పడేస్తుంటారు. నిజానికి కొన్ని చోట్ల ఈ చింత గింజలను పెద్ద మొత్తంలో అమ్ముతుంటారు కూడా. వీటిని ఆయుర్వేదంలో వీటిని బాగా ఉపయోగిస్తారు. మధుమేహం నుంచి జీర్ణ సంబంధిత సమస్యల వరకు అనేక ఆరోగ్య సమస్యల కోసం ఇవి మనిషి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతాయి. మరి చింతగింజలు ఎలా ఉపయోగపడుతాయో ఒకసారి చూద్దామా..
Read Also: Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు షాక్ – 126 కోట్లు ఫ్రిజ్, 3 మంది అరెస్ట్!
చింత గింజల పొడిని నీటిలో కలిపి తాగితే అజీర్ణం సమస్యలు బాగా తగ్గుతాయి. ఇది అసిడిటీ సమస్యను నివారించడంలో బాగా సహాయపడుతుంది. కడుపులో గ్యాస్, గర్భాశయ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా చింత గింజల పొడి చర్మానికి అప్లై చేస్తే మృదువుగా మారుతుంది. ఇది యాంటీ-ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ముడతలను తగ్గించగలదు. చర్మంపై ఉన్న మచ్చలు, గాయం బాగుపడటానికి సహాయపడుతుంది.
చింత గింజలలో యాంటీ-ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉండటంతో కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గించగలుగుతుంది. గింజలను పొడిగా చేసుకొని వేడి నీటిలో కలిపి నొప్పిగల ప్రదేశంలో మర్దన చేస్తే మంచి ఫలితం పొందవచ్చు. అలాగే చింత గింజలలో రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించే గుణాలు ఉంటాయి. మధుమేహ రోగులు వీటిని వాడటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దానితో వైరల్, బాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
Read Also: DC vs LSG: 30 మంది అనాథ చిన్నారులకు ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించిన ఏసీఏ
చింతగింజల పొడిని నీటిలో కలిపి పుక్కిలిస్తే నోటి సమస్యలు తగ్గుతాయి. నోటి పూత, దంత సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే చింత గింజల నీటిని తలస్నానానికి ఉపయోగిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. స్కాల్ప్ ఆరోగ్యంగా మారటానికి సహాయపడుతుంది.