ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై కేసులు నమోదు చేశామని ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ తెలిపారు. నకిలీ విత్తనాలతో వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీగా రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏటూరు గ్రామ సమీపంలో కారులో అటవీ జంతువు మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అటవీ జంతువు ఉన్న కారు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నాలుగు రోజులుగా కొనసాగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. నేడు వన దేవతలు వన ప్రవేశంతో జాతర ముగియనుంది. నేటి సాయంత్రం పూజారులు గద్దెల దగ్గరకు వచ్చి సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత వన దేవతల వన ప్రవేశం స్టార్ట్ అవుతుంది.
మేడారం మహా జాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నంగా పూర్తైంది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ నిన్న (బుధవారం) అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం ఇవాళ జరగనుంది.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ నేడు (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాలతో కలిపి కొత్త రెవెన్యూ డివిజన్‌ని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీతక్క మాట్లాడుతూ.. యువకుల బలిదానాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెలంగాణ రాష్ట్రంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆమె పేర్కొన్నారు. లీకేజీల పేరుతో ఉద్యోగుల ప్రశ్న పత్రాలను ప్రభుత్వం అమ్ముకుంటుంది.. గల్లి గల్లికి ఒక వైన్ షాపు, ఇంటింటికి ఒక మద్యం షాపు పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ.. యువతను పక్క దారి పట్టిస్తుంది అని సీతక్క తెలిపింది.
కొండాయి గ్రామంలో పర్యటించిన మంత్రి వరదలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ బరోసా ఇచ్చారు. అనంతరం వరద బాధితులకు ఆమె ఆహారం అందించారు. రవాణా సౌకర్యం కొరకు కూలిపోయిన బ్రిడ్జినీ పునర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.