కాంగ్రెస్ పార్టీలో రెబల్ నేతగా పేరున్న మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి ఏం మాట్లాడినా సంచలనమే. విజయవాడ వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆమె మాట్లాడారు. అమరావతి రైతులు ఎన్నో రోజులుగా క్రమశిక్షణతో నిరసనలు చేస్తుంటే కనికరించలేని కఠిన మనస్సు ఉన్నోడికి రాజకీయాలు ఏమి తెలుసు..ముఖ్యమంత్రి రౌడీయిజంతో, అందరిపైనా దాడులు చేస్తూ అసలు ప్రగతి అనేది ఎక్కడా కనపడని పరిస్థితుల్లో ప్రజలు వేధిస్తున్నాడని మండిపడ్డారు.
Read Also:Manchu Manoj: మోహన్ బాబు లేకుండానే మనోజ్ రెండో పెళ్లి..?
రోజుకో స్కీం అంటూ బంగారం లాంటి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్న ముఖ్యమంత్రిని చూస్తే పిచ్చోడి చేతిలో రాయి అనే సామెత మనకు గుర్తుకు వస్తుందన్నారు రేణుకా చౌదరి. ఏదైనా ప్రశ్నిస్తే కులాలను అడ్డుపెడుతున్నారు..ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రజలు నన్ను ఆహ్వానిస్తున్నారు..ఏమి చేయాలనేది ఆలోచిద్దాం.. ఆయన ఆస్తిలో వాటా కాదు.. ప్రజాస్వామ్యంలో హక్కు. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు నిలబెట్టుకునేందుకు ప్రజలు, అమరావతి రైతులు వాళ్లకి వేసే ఓటు తిరస్కరించి న్యాయంగా ఓటు వేసుకుని గెలవాలన్నారు.
నా ఇష్టం వచ్చినపుడు నేను వస్తా..నన్ను ఆపే సత్తా ఎవరికి లేదు..నేను ఎక్కడి నుండైనా పోటీ చేస్తానన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కుడా పాటించని వాడు..ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని రేణుకాచౌదరి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అయితే ఏమిటి ముఖ్యమంత్రే సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించని నీ మాట మేము వినాలని ఎక్కడా లేదుగా అన్నారు. నీకు చట్టం అమలు కాకపోతే మాకు కాదు.
Read Also:Crime News: దారుణం.. ప్రైవేట్ పార్ట్‌లోకి ప్రెజర్ ఎయిర్ పైప్‌ను జొప్పించి, వాల్వ్ ఓపెన్ చేసి..
రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్శిటీకి పెట్టడం వల్లన ఆయన పేరు తరగదు,పెరగదు. జగన్ రెడ్డి హెల్త్ కండీషన్ కు చికిత్స చేయించేందుకు నేను సిద్దంగా ఉన్నా. తెలంగాణను ముంచేసి అక్కడ అడ్డుకు తినే పరిస్థితి తీసుకువచ్చాడు.130 ఏళ్లకు పైన ఉన్న కాంగ్రెస్ ఒక్క ఉమ్మడి కుటుంబం అన్నారామె.