Manchu Manoj: మంచు వారింట పెళ్లి సందడి మొదలైపోయింది. మంచు మోహన్ బాబు రెండో కుమారుడు, నటుడు మంచు మనోజ్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. గత కొన్నేళ్ల క్రితం మనోజ్.. తన మొదటి భార్య ప్రణీతకు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. విడాకుల అనంతరం మనోజ్.. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని టాక్. ఇక ఈ పెళ్లి.. మోహన్ బాబుకు కానీ, మనోజ్ అన్న విష్ణుకు కానీ ఇష్టం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. మౌనిక.. టీడీపీ నేత కుమార్తె కావడమే కాకుండా.. ఆమె ఆల్రెడీ విడాకులు తీసుకున్న మహిళ. దీంతో మోహన్ బాబుకు ఈ సంబంధం ఇష్టం లేదని టాక్.
Osho Tulasiram: ‘దక్షిణ’ చెల్లిస్తానంటున్న సాయి ధన్సిక!
ప్రస్తుతం మోహన్ బాబు.. జగన్ కు మద్దతుగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో టీడీపీ కి చెందిన వ్యక్తి కూతురును కోడలిగా తెచ్చుకోవడం ఇష్టంలేకనే ఆయన ఈ పెళ్ళికి నో చెప్పారట. కానీ, మనోజ్ మాత్రం ఆ అమ్మాయే కావాలని పట్టుబట్టడంతో మంచు వారసుల మధ్య గొడవలు కూడా జరిగాయని, ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి మోహన్ బాబు తన కుమారులకు ఆస్తిని కూడా పంచేసి.. మనోజ్ ను బయటికి వెళ్లిపొమ్మనట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక తమ్ముడు ప్రేమకు అక్క మంచు లక్ష్మీ సపోర్ట్ గా నిలిచిందట. ప్రస్తుతం ఆమె ఇంటివద్దనే మనోజ్ పెళ్లి జరగనుంది.
PS 2: చోళులు చెప్పిన రోజే వస్తున్నారు…
మార్చి 3 న ఈ వివాహం అతి కొద్దీ బంధుమిత్రుల మధ్య ఘనంగా జరగనుంది. అయితే ఈ పెళ్ళికి మోహన్ బాబు వస్తాడా..? రాడా..? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నాడట. అక్కడే తన విద్యాసంస్థలను చూసుకుంటూ ఉన్న మోహన్ బాబు కొడుకు రెండో పెళ్ళికి హాజరవుతాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ మోహన్ బాబు వస్తే.. మరోసారి ఈ మంచు కుటుంబం ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేసినట్టే.. మరి మోహన్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.