నెల్లూరు జిల్లా కావలిలో ఆటోనగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు. నిరంతరం రాత్రి పగలు ప్రయాణీకుల రవాణా సౌకర్యాన్ని అందించేందుకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఈ మధ్య దాడులు పెరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
AP JAC Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు ముగిసిన తర్వాత.. చల్లబడినట్టే కనిపించిన ఉద్యోగ సంఘాలు మళ్లీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.. ఏపీ జేఏసీ అమరావతి అత్యవసర కార్యవర్గ సమావేశం ముగిసింది.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.. మొత్తంగా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఏపీ జేఏసీ అమరావతి. ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.. మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అభిప్రాయపడింది అత్యవసర కార్యవర్గం. ఆ తర్వాత ఉద్యమ…
ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పీఆర్సీ అంశం. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల. ఉద్యోగ సంఘాల అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సజ్జల. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నాం అన్నారు. మళ్ళీ కలిసి పనీ చేస్తాం అన్న…
ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాటం ఆపేది లేదంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడారు.…
సాధారణంగా నడక ముందుకు సాగుతుంది. కానీ ఏపీలో ఉద్యోగులు మాత్రం రివర్స్ గా నడిచి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రివర్స్ పీఆర్సీ ఇచ్చారంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కు నడిచి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో జనవరి నెలకు సంబంధించి తమకు పాత వేతనాలే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నసంగతి తెలిసిందే. పీఆర్సీ సాధన…