Punch Prasad: జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో పంచులు మీద పంచ్ లు వేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మొదటి నుంచి కూడా పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన రెండు కిడ్నీలు పాడైపోయాయని, వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యుల సూచించినట్లు పంచ్ ప్రసాద్ తెలిపాడు. దీనికోసం చాలా ఖర్చు అవుతుందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే తన భార్య కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా.. సర్జరీకి కావాల్సిన డబ్బు తన వద్ద లేదని, దాతలు ఎవరైనా సహాయం చేయాలని యూట్యూబ్ ద్వారా పంచ్ ప్రసాద్ స్నేహితులు ఇమ్మాన్యుయేల్, నూకరాజు కోరిన విషయం కూడా తెలిసిందే. ఇక పంచ్ ప్రసాద్ సర్జరీ విషయమై మంత్రి రోజా తన పలుకుబడిని ఉపయోగించి సీఎం జగన్ తో మాట్లాడి, సర్జరీకి కావలసిన ఏర్పాట్లు చేసింది.
Vijay Devarakonda: ఆహా.. కొండన్న చేతిలో చెయ్యేసింది ఆమెనే.. ?
ఇక సర్జరీ సక్సెస్ అయిన తర్వాత పంచ్ ప్రసాద్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. దాదాపు మూడు నెలల తర్వాత పంచ్ ప్రసాద్ మొట్టమొదటిసారి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో తన కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రిని మిస్ అవుతున్నారా అని అడిగిన ప్రశ్నకి “నా తండ్రి విలువ ఆయన ఉన్నప్పుడు తెలియలేదు కానీ, నేను తండ్రి అయ్యాక తెలిసింది. నా కొడుకుకు నేను తండ్రి కాదు.. నా కొడుకే నాకు తండ్రి.. నేను ఏదైనా బాధలో ఉంటే.. నీకు ఏమీ అవ్వదు నాన్న అని నాకు ధైర్యం చెప్పాడు” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారాయి. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత పంచప్రసాద్ ను ఈ షో లో చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఆయన ఇంకా కోలుకొని మరిన్ని షోస్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.