Software Engineers: మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నట్లు చెప్పారు. AI ద్వారా రానున్న రోజుల్లో మధ్యస్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను భర్తీ చేస్తామని చెప్పారు. మెటాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పటికే మధ్య స్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సామర్థ్యాలను చేరుకుంటుందని వెల్లడించారు. యూట్యూబర్ జో రోగన్‌తో పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని చెప్పారు.
Read Also: Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా.. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట!
2025 నాటికి మెటా, ఇతర టెక్ కంపెనీలలో ప్రస్తుతం కోడ్ రాసున్న మిడ్ లెవన్ ఇంజనీర్లను AI సమర్థవంతంగా భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. ‘‘మన యాప్‌లలో అన్ని కోడ్‌లను ఏఐ జనరేట్ చేస్తుంది, ఇది ఇంజనీర్లు చేసే పనిచేస్తుంది’’ అని చెప్పారు. మెటాలో ప్రస్తుతం మిడ్ లెవల్ ఇంజనీర్లు ఆరు అంకెల జీతాలను తీసుకుంటారు. ఒక వేళ ఏఐతో వీరిని భర్తీ చేస్తే కంపెనీ ఖర్చుల్ని భారీగా తగ్గించే అవకాశం ఉంది.
గూగుల్, ఐబీఎం వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా తమ కార్యకలాపాలలో AIని అనుసంధానిస్తున్న సమయంలో జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు రావడం గమనార్హం. గూగుల్‌లోని కొత్త కోడ్‌లలో 25 శాతానికి పైగా ఇప్పుడు AI ద్వారా జనరేట్ చేస్తుందని ఇటీవల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇంతకుముందు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ కంపెనీ బ్యాక్ ఆఫీస్ రోల్స్‌లో AI ద్వారా 30 శాతం వరకు భర్తీ చేయవచ్చని వెల్లడించారు. ఈ పరిణామాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు రాబోయే కాలంలో గణీయమైన ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు.