కోనసీమను మించేలా పులివెందులలో మొట్టమొదటిసారిగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తాము కూడా తగ్గేదేలే అంటూ బరులు గీసి పందాలకు తెర లేపారు అక్కడి రాజకీయ నేతలు... మొట్టమొదటిసారిగా పులివెందుల చరిత్రలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోనసీమకు తామేమి తీసుకోమని టెంట్లు వేసి బరులు గీసి జోరుగా పందేలు నిర్వహిస్తున్నారు.