సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసాపై సంచలన ప్రకటన చేశారు. రైతాంగానికి నూతన సంవత్సరం మంచి జరగాలని తమ ప్రభుత్వం వారిని అండగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయం పండగ చేయాలని తమ ఆలోచన అన్నారు.
Read Also: Pawan Kalyan: జనసేనకి ఇంధనంగా దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు ఏడాదికి పది వేలు ఇచ్చింది.. తాము 12 వేలు ఇస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా.. భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతీ ఏటా 12 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని చెప్పారు.
Ram Charan: ఇండియన్ పాలిటిక్స్ కి ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్!
మరోవైపు.. రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరి 26 నుండి పథకాలు అమలు చేస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కానీ భూములు.. మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఉండదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న భూములకు రైతు భరోసా ఇవ్వమన్నారు. గ్రామాల వారీగా సభలు పెట్టి ప్రజలకు వివరిస్తాం.. అలాంటి వారు మీరే నేరుగా తప్పుకోండని తెలిపారు. ఆర్థిక పరిస్థితి వెసులు బాటు పట్టి రైతు భరోసాను రూ. 10 వేల నుండి రూ. 12 వేలకు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు కూడా ఇస్తున్నాం.. 12 వేలు కాబట్టి ఆర్థిక వెసులు బాటు పట్టి ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేయకపోయినా.. సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా అని పేర్కొన్నారు. కోతలు లేవు.. అందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పారు.