గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ…. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేదు. దాదాసాహెబ్ ఫాల్కే గారిని మరిచిపోలేదు. తెలుగు సినిమాలను ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మరిచిపోలేదు. బీఎన్ రెడ్డి గారిని మర్చిపోలేదు. రామ్ బ్రహ్మంగారిని మర్చిపోలేదు. ఈ రోజు ఎంతమంది వేదిక మీద శంకర్ గారు లాంటి మహానుభావులు ఉన్నారంటే మేము మూలాలు మరిచిపోకూడదు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలందరిని గుర్తు చేసుకుంటూ తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనని స్మరించుకుంటూ పవన్ కళ్యాణ్ ఉన్న, రామ్ చరణ్ ఉన్న, ఏ హీరోలు ఉన్నాగాని దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు.
Ram Charan: ఇండియన్ పాలిటిక్స్ కి ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్!
మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు.. ఓజి అనొచ్చు… ఆ మూలాలు ఎక్కడో మారుమూల ఒక చిన్న పల్లెటూరులో ఒక గ్రామంలో మొగల్తూరు అనే ఒక గ్రామంలో చదువుతూ ఒక కాలేజీలో చదువుతూ ఈ స్థాయికి వచ్చారు. ఈరోజు మీరు మమ్మల్ని ఎన్ని పేర్లతో పిలిచినా దేనికైనా ఆయనే ఆధ్యులు. నేనెప్పుడూ మూలాలు మరిచిపోను. ఎన్టీఆర్, ఏఎన్నార్ ,కృష్ణ, శోభన్ బాబు లాంటి ఎంతోమంది నిష్ణాతులు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తి దార పోశారు. ఈరోజున ఇంత బలంగా సినిమా ఈవెంట్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం, నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆశీస్సులు, ఆయన సహకారం ఆయన నిరంతర మద్దతు వల్లేఈరోజు ఇంత అద్భుతమైన సభ జరుపుకోగలుగుతున్నాం. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీసువారికి కూడా కృతజ్ఞతలు అంటూ ఆయన పేర్కొన్నారు.