దర్శకుడు శంకర్ గురించి, నిర్మాత దిల్ రాజు గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా ఈ మేరకు కామెంట్ చేశారు. నేను చాలా తక్కువ ది సినిమాలే, థియేటర్ కి వెళ్లి చూసేవాడిని. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమా తమిళంలో బ్లాక్ టికెట్ కొనుక్కొని సినిమా ధియేటర్ కి వెళ్ళాను. రాజకీయాలు సంగతి పక్కన పెట్టండి అప్పటికి అసలు యాక్టర్ అవుతానో లేదో కూడా తెలియదు కానీ ఆయన సినిమాని మాత్రం బ్లాక్లో టికెట్ కొనుక్కొని చూశాను. ప్రేమికుడు సినిమాకి కూడా ఎవరూ తోడు లేక మా అమ్మమ్మను తోడు తీసుకువెళ్లాను. అంటే అలా అన్ని వయసుల వారిని ఆకట్టుకునే సినిమాలు చేయడం ఆయన స్టైల్. ఆయన ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చేస్తారు, మంచి సినిమాలు చేస్తారు.
Pawan Kalyan: నేను, చరణ్ ఈ స్థాయిలో ఉన్నామంటే చిరంజీవి గారి వల్లే
ఈ రోజున భారతదేశంలో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, చరణ్ కానీ వీరందరికీ ప్రపంచ ఖ్యాతి రావడానికి ఆధ్యులు కొంతమంది దర్శకులు ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాది నుంచి. వారిలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి శంకర్ గారు. గొప్ప సినిమాలు చేశారు శంకర్ గారు. దిల్ రాజుగారు నేను తొలి ప్రేమ సినిమా చేస్తున్నప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్. ఎక్కడో పోస్టర్ చూసి ఎవరో చెప్పిన మాట విని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మాకు అడ్వాన్స్ ఇచ్చారు. అలా మొదలైన వ్యక్తి నా వకీల్ సాబ్ నిర్మాత కూడా ఆయనే. ఆయన ఎలాంటి నిర్మాత అంటే నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేనప్పుడు అండగా నిలబడ్డారు. పేరు ఉంది కానీ డబ్బులు లేవు మార్కెట్ ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా నాతో తీసి జనసేన అనే పార్టీకి ఇంధనంగా ఆ డబ్బు పని చేసేలా చేశారు దిల్ రాజు అంటూ పవన్ పేర్కొన్నారు .