గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హీరో రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పక్కన బాబాయ్ పవన్ కళ్యాణ్ సహా సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్లు నిర్మాత దర్శకుడుతో పాటు మిగతావారు వేదిక మీద ఉండగా రామ్ చరణ్ మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ… నమస్తే ఏపీ చాలా దూరం నుంచి చాలా శ్రమ తీసుకుని సినిమా మీద, సినిమా పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి అభిమానికి పేరుపేరునా ధన్యవాదాలు. ముందుగా రాజమండ్రిలో ఉన్న ఈ జనసంద్రన్ని చూస్తుంటే నాకు మరో రోజు గుర్తొస్తోంది.. మన రాజమండ్రి బ్రిడ్జి మీద మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అక్కడ ర్యాలీ చేసినప్పుడు ఆ జనసంద్రం చూస్తే ఇలాగే ఉంది. అక్కడ కూడా రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చాలా చేశాము. చాలా రోజులు చేశాం. పవన్ కళ్యాణ్ గారికి చాలా థాంక్యూ ఇవాళ ఇలా వచ్చినందుకు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనతోపాటు వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ చాలా థాంక్స్.. చాలా మాట్లాడాలి అనుకున్నాను కానీ ముందు మీరు వెనక బాబాయ్ అందరిని చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉంది.
Shankar: పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్‘లో ఎలివేషన్ ఇచ్చిన శంకర్
సినిమా పేరు గేమ్ చేంజర్.. అని శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెరమీద బహుశా నేను చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర. కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్ కి ఏకైక గేమ్ చేంజర్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన పక్కన నేను నిలబడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనం కోసం ఇంత తపన పడి ఇంత ఆలోచించే ఒక వ్యక్తి పక్కన నిలబడటం ఆ కుటుంబంలో పుట్టడం మీతో ఇలా ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శంకర్ గారు ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్లు రాశారో మీ అందరికీ తెలుసు. మీ నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసి రాసిన క్యారెక్టర్లు ఇవి. చాలా థాంక్స్ చాలా చాలా మాట్లాడాలి అనుకున్నాను కానీ మరో వేదిక మీద మీరు ఏమీ అనుకోకపోతే మాట్లాడతాను. ఈ ఒక్కసారికి నాకు కూడా వినాలనుంది. మా డిప్యూటీ సీఎం గారు మా ఓజి మాట్లాడితే అంటూ ఆయన ముగించారు.