గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… హీరో రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ పుట్టినప్పుడు తాను ఇంటర్ చదువుతున్నానని అన్నారు. అన్నయ్యకి కొడుకు పుట్టాడని చెప్పి ఇంట్లో నామకరణం చేశారు. నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు ఒక పేరు పెట్టారు. మా ఇంట్లో అందరికీ ఆంజనేయ స్వామి అని పేరు రావాలి. ఎందుకంటే ఆయన మా ఇంటి దైవం. అందుకే రామ్ చరణ్ కి రాముడు చరణాల దగ్గర ఉండేది ఎవరు? ఆంజనేయస్వామి. ఎంత ఎదిగిన ఎంత శక్తి యుక్తులు ఉన్న.. తన శక్తి తనకు తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగేలా ఇతనికి రామ్ చరణ్ పేరు పెట్టాలని మా నాన్నగారు ఆలోచన చేసి తనకు రామ్ చరణ్ అని పేరు పెట్టారు. మాకు మా అన్న పితృ సమానులు. మా వదినను అమ్మ అనే పిలుస్తాను. అందుకే రామ్ చరణ్ కి నేను బాబాయ్ అనే కంటే కూడా వాడు నాకు తమ్ముడు లాగా. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని ఎందుకంటే నేను అప్పటికి బాగా బద్దకంగా ఉండేవాడిని. నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే.. రామ్ చరణ్ ఏడేళ్ల వయసులో చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడు. ఒక్కోసారి నేను ఆ సమయంలో దింపాల్సి వచ్చేది.
సోఫాలో పడుకున్న నన్ను లేపి దింపమని అడిగేవాడు. అంటే నేను అంత బద్దకంగా ఉంటే తను మాత్రం ఏడేళ్ల వయసులోనే ఎంతో క్రమశిక్షణగా ఉండేవాడు. రామ్ చరణ్ లో ఇంత శక్తిసామర్థ్యాలు ఉన్నాయని సినిమాల్లోకి వచ్చే వరకు తెలియదు. ఎందుకంటే సినిమాల్లోకి వచ్చేవరకు తను డాన్స్ చేయడం చూడలేదు. సినిమాల్లో తప్ప రామ్ చరణ్ వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడూ చూడలేదు. మామూలుగా మ్యూజిక్ వస్తే కాలు కూడా ఆడించడు కానీ ఒక అద్భుతమైన డాన్సర్. రంగస్థలం సినిమాకి బెస్ట్ నేషనల్ అవార్డు యాక్టర్ రావాలి అని కోరుకున్నాను. రామ్ చరణ్ ఎప్పుడు ఆంధ్రాలో పెరగలేదు అయినా సరే ఇక్కడి క్యారెక్టర్ ను పట్టేసి ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి ప్రాంతంలోనే ఉన్న వ్యక్తిగా కనిపించిన విధానం చూసి నాకు చాలా నచ్చాడు.
చిరంజీవి గారి వారసుడు కదా అందుకే అలా ఉన్నాడు అంటూ కామెంట్ చేశారు. చిరంజీవి గారికి తగ్గ వారసుడు రామ్ చరణ్ అంటూ పవన్ పేర్కొన్నారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టారే అవుతాడు. చిరంజీవి గారిని ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే మాకు మా అన్నయ్య అంటే.. ఎందుకు గౌరవం అంటే… ఆయన మొగల్తూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి. ఎవరు ఇక్కడ ఆధారం లేరు.. ఇక్కడ లక్షలమంది ఉన్నారు. మన కోసం ఎవరు నిలబడాల్సిన అవసరం లేదు మీకు మీరే అండగా ఉండాలని అనుకుంటే మీరు సాధిస్తారు. క్రమశిక్షణ పట్టుదల సాధించాలని తపన ఉంటే అందరూ మెగాస్టార్ చిరంజీవిలా మంచి స్థాయికి వెళతారని పవన్ అన్నారు..