CM YS Jagan: మీరు కృష్ణుడు అయితే.. నేను అర్జనుడిలా పోరాటం చేస్తాను అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆయన మాట్లాడుతూ హాట్ కామెంట్లు చేశారు.. వేదిక పై ఉన్న మూడు జిల్లాల నాయకులను పేరుపేరునా పలకరించిన జగన్.. వాక్ వే పై నడిచి కార్యకర్తలు కు అభివాదం చేశారు.. సిద్ధమా.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. మరో చారిత్రాత్మక విజయానికి సిద్ధమా..? పేదల భవిష్యత్తుని, పేదలను కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి సిద్ధమా? అంటూ సభలో ఉన్న కార్యకర్తలను ప్రశ్నించి సమాధానం రాబట్టారు.. ఇక, రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అంతా మన రాష్ట్రంలో ఉన్నారు.. దత్తపుత్రుడు, ఇతర పార్టీల్లో ఉన్న కోవర్టులు అంతా ఏకం అవుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక, ఈ సీన్ చూస్తే జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు..? అని ప్రశ్నించిన ఆయన.. నిజమేమిటో అంటే కనిపిస్తున్నది నిజం, లక్షల హృదయాల్లో ఉన్నాడు అనేది నిజం.. జగన్ ఏ నాడు ఒంటరి కాదన్నారు. నాకు ఉన్న తోడు, నా దైర్యం, నా బలం పైనున్న దేవుడు, ఎదురుగా ఉన్న జనమే అన్నారు జగన్.
నిజమైన నాయకుడు అంటే ఎంత ప్రేమ ఉంటుందో ఇక్కడ చూస్తే అర్దం అవుతుందన్నారు జగన్.. చరిత్రలో ఎప్పుడు లేని అభివృద్ధితో 175 కి 175 , 25 ఎంపీలకు 25 స్థానాలను గెలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే మీ అందరితో నా మనసు పంచుకుంటున్నా.. ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన మంచి పనుల గురించి అడగండి.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మీ ఇంటికి, మీ ఊరికి, మీ సామాజిక వర్గానికి ఏం చేశాడు అని అడగండి.. అదే ప్రతి పేద కుటుంబాన్ని అడగండి గత పదేళ్లలో వారి బ్యాంకు అకౌంట్ వివరాలను చూడమని చెప్పండి.. జగన్ పాలనలో జరిగిన మంచి ఎంటి అమలు చేసిన స్కీములు బట్టి తెలుస్తుంది.. ఒక్క రూపాయి అయిన చంద్రబాబు అక్కచెల్లెళ్ళ ఖాతాలో వేశారా అని అడగండి.. 57 నెలలు మీ బిడ్డ పాలనలో ఏం చేశాడో ప్రతి ఇంట్లో వివరించండి అని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత.
కుప్పంతో సహా ఏ గ్రామంలో చూసినా ప్రతి అక్క చెల్లెమ్మలు కు వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది.. ఎవరు పెట్టారు అంటే జగన్, మీ వైఎస్సార్సీపీ.. లంచాలకు, వివక్షతకు అవకాశం లేకుండా డబ్బులు పంపుతున్నది మీ జగన్, మన వైఎస్సార్సీపీ.. బడులు నాడు నేడుతో మారుతున్నాయి అంటే చేసేది జగన్ అని వ్యాఖ్యానించారు సీఎం జగన్.. 68 శాతం మంత్రి పదవులు ఎస్సీ, బీసీ, ఎస్టీలకు దక్కాయి అంటే వైఎస్సార్సీపీ పాలనలో మాత్రమే.. సామాజిక న్యాయం మీ బిడ్డ పాలన మొదలయ్యాక జరుగుతుంది.. 2 లక్షల 13 వేల ఉద్యగాలు వచ్చాయి అంటే మన ప్రభుత్వంలోనే అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..