CM Revanth Reddy: హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు
- కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు పాత్ర కీలకం
- హిందూ.. ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు
- దేశంలో ఉన్నవి రెండే పరివార్‌లు
- ఒకటి మోడీ పరివార్
- రెండోది గాంధీ పరివార్
- రవీంద్రభారతిలో కార్యక్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారన్నారు. రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవ& మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం ప్రసంగించారు. “మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం. దేశంలో ఉన్నవి రెండే పరివార్‌లు. ఒకటి మోడీ పరివార్.. రెండోది గాంధీ పరివార్.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోడీ పరివార్ పనిచేస్తోంది. దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తోంది. దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. ముస్లింలను మేం ఓటర్లుగా చూడటం లేదు.. సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదు.. అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కానీ షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారులుగా చేశాం. అమీర్ అలీ ఖాన్ కు ఎమ్మెల్సీ ఇచ్చాం.” అని సీఎం వ్యాఖ్యానించారు.
READ MORE: Cricketer Son: షాకింగ్.. అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు!
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
కార్పొరేషన్‌లలో ముస్లింలకు అవకాశం ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్ తరువాత ఇప్పటి వరకు సీఎంఓ లో మైనారిటీ అధికారిని నియమించలేదని మండిపడ్డారు. “మన ప్రభుత్వంలో సీఎంఓలో ఒక మైనారిటీ అధికారిని నియమించాం. దేశంలో మైనారిటీలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మోడీ పరివార్ తో ఉండాలో గాంధీ పరివార్ తో ఉండాలో మీరే నిర్ణయించుకోండి. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు కృషి చేయాలి. దేశంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. మహారాష్ట్రలో మహావికాస్ అగాదీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయండి. దేశంలో మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దు.” అని సీఎం పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!