రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారన్నారు. రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవ& మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం ప్రసంగించారు. "మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం. దేశంలో ఉన్నవి రెండే పరివార్‌లు.