CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు సీఎం రేవంత్‌రెడ్డి. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రచార సభల్లో పాల్గొంటూ ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ (ఆదివారం) యాదాద్రి భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రోడ్ షో, సభలో రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. భువనగిరి సభకు సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.
Read also: Delhi Capitals: పొరపాటు చేశా.. ఢిల్లీ ఓటమి కారణం నేనే: రిషబ్ పంత్
ప్రచార సభల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. హామీల అమలుపై కూడా స్పష్టమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసిన రేవంత్.. తన 100 రోజుల పరిపాలనతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏం చేస్తాననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ చౌరస్తా, జగదేవ్ పూర్ రోడ్డు, పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Read also: Varsha Bollamma: నడుము అందాలతో అలరిస్తున్న వర్ష బొల్లమ్మ…
మరోవైపు రేవంత్ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారి వెంబడి రోడ్ షో కార్యక్రమం ఉన్నందున తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సీఎం రేవంత్ చర్చించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భువనగిరికి వస్తున్న రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు.
Vontimitta: రేపు ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణోత్సవం