CM Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నా పని నేను చేస్తున్నా
- ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్
- నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు- సీఎం
- నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను- సీఎం రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను.. అమలు చేయకపోతే అడిగేది నన్నే
- కొందరు నాపై దుష్ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు- రేవంత్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణ కులగణనపై పూర్తిగా రాహుల్ గాంధీకి వివరించాను.. పూర్తి శాస్త్రీయంగా కులగణన చేశామని తెలిపారు. తెలంగాణలో బహిరంగ సభ ఉంటుంది, దానికి రావాలని రాహుల్ గాంధీని కోరానని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన ఆదేశాలను ఫాలో అయ్యానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Read Also: Monalisa: కుంభ్ మోనాలిసాకి డైమండ్ నెక్లెస్.. ఇచ్చిందెవరో తెలిస్తే షాక్!
Also Read
తెలంగాణ రాష్ట్ర కులగణన దేశానికి రోడ్ మ్యాప్.. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. రాజకీయ కోణంలో కాదు ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగిందని అన్నారు. ప్రజలను ఉద్రేకపరిచే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి.. ఎక్కడ లెక్క తప్పలేదు అని వివరించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు తీసుకొస్తాం.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కంటే ముందే.. కేటీఆర్ ఏదేదో చెప్తున్నాడు.. సబిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారని ప్రశ్నించారు.
Read Also: Hyderabad: ప్రియురాలి పేరెంట్స్ వేధింపులకు ప్రియుడు బలి..
‘నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు.. కానీ నా పని నేను చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తనను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనని తెలిపారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను.. అమలు చెయ్యకపోతే అడిగేది నన్నే అని పేర్కొన్నారు. కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. క్యాబినెట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదని.. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలను తాను పట్టించుకోనన్నారు. పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!