మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోని భోంస్లే దండలు అమ్మడానికి మహాకుంభ మేళాకు వచ్చింది. అక్కడ రాతన మెరిసే కళ్ళతో ఉన్న ఆ అమ్మాయి, క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరువాత, వివిధ ప్రాంతాల నుండి చాలా మంది ఆ అమ్మాయిని చూడటానికి, ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవడానికి వచ్చారు. ఆ వీడియో, ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించడంతో, మోనాలిసాకు సినిమాల్లో నటించే అవకాశం కూడా లభించింది. సనోజ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో ఆమె నటించనుంది. ఈ సినిమాకి గాను మోనాలిసా 21 లక్షల రూపాయలకు సంతకం చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే హానీ రోజ్ లైంగిక వేధింపులు అంటూ ఫిర్యాదు చేసిన బాబీ చెమ్మనూర్ మోనాలిసాను కోజికోడ్ కు తీసుకువచ్చాడు.
Ajith Kumar : అజిత్ 64 డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరు.?
ఆమెకు బాబీ చెమ్మనూర్ వాలెంటైన్స్ డే బహుమతిని ఇచ్చాడు. బాబీ మోనాలిసాకు ఒక డైమెండ్ నెక్లెస్ హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. కానీ బాబీ తరువాత మోనాలిసాకు పది వేల రూపాయల విలువైన నెక్లెస్ ఇచ్చానని చెప్పాడు. పూసలమ్ముకునే మోనాలిసా తన లుక్‌లో చాలా చేంజ్ ఓవర్ తో కేరళకు చేరుకుంది. కూలింగ్ గ్లాసెస్, నల్లటి దుస్తులు ధరించి స్టైలిష్ గా కనిపిస్తూ విమానాశ్రయానికి వచ్చింది. మోనాలిసాతో పాటు ఆమె సోదరుడు కూడా ఉన్నారు. కేరళకు వచ్చిన ఆమె సినిమాలో నటించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని అన్నారు. మోనాలిసాను కేరళకు తీసుకురావడానికి బాబీ చెమ్మనూర్ రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.