Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- సుడాన్ వ్యక్తికి ఎబోలా నెగిటివ్‌గా తేల్చిన ఎన్ఐవీ
- సీసీఎంబీ, పూణే ల్యాబ్ పరీక్షలతో స్పష్టత
- గాంధీ ఐసోలేషన్ వార్డులో ఇంకా ఇద్దరు అనుమానితులు
- రేపు వచ్చే మరో ఇద్దరి శాంపిల్స్ ఫలితాలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ebola Virus : హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఎబోలా వైరస్ అనుమానంతో చేరిన సుడాన్ దేశస్థుడి వైద్య పరీక్షల నివేదిక (రిపోర్ట్) నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో గాంధీ ఆసుపత్రి వైద్య వర్గాలు, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. సుడాన్ దేశం నుండి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో నిన్న ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. నిన్న ఉదయాన్నే ఆసుపత్రి వైద్యులు సదరు వ్యక్తి నుంచి అత్యంత జాగ్రత్తగా రక్త నమూనాలను (శాంపిల్స్) సేకరించి మొదట హైదరాబాద్‌లోని సీసీఎంబి (CCMB) కి పంపించారు. అక్కడి శాస్త్రవేత్తలు ఆ శాంపిల్స్‌ను తదుపరి నిర్ధారణ కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపారు. కొద్దిసేపటి క్రితమే పూణే ఎన్ఐవీ అధికారులు ఈ నివేదికను గాంధీ ఆసుపత్రి వైద్యులకు ల్యాబ్ ద్వారా అందించారు. ఇందులో సదరు వ్యక్తికి ఎబోలా రాలేదని, నెగిటివ్ అని వైద్యులు అధికారికంగా తేల్చారు.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
ఐసోలేషన్ వార్డులో మరో ఇద్దరు అనుమానితులు
సుడాన్ వ్యక్తికి ఎబోలా నెగిటివ్ వచ్చినప్పటికీ, గాంధీ ఆసుపత్రిలో ఎబోలా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో మరో ఇద్దరు ఎబోలా అనుమానితులు చికిత్స పొందుతున్నారు. వైద్య సిబ్బంది ఇప్పటికే వారి నుంచి కూడా శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం సీసీఎంబికి పంపించారు. వీరిద్దరి నివేదికలు రేపు (శనివారం) వచ్చే అవకాశం ఉందని గాంధీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంతవరకు ఐసోలేషన్ వార్డులో ముందస్తు జాగ్రత్తలు కొనసాగుతాయని వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!