Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
- మొహాలీలో దారుణం
- ఆఫీసులోనే యువతిని హత్య చేసిన సహోద్యోగి
- బెంబేలెత్తిపోయిన తోటి ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొహాలీలో అత్యంత ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిని.. ఆమెతో పాటే పనిచేసే సహోద్యోగి ఆఫీస్‌లోనే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. వారిద్దరి మధ్య ఉన్న పాత పరిచయం, ప్రేమ వ్యవహారంలో వచ్చిన విభేదాల కారణంగానే ఈ ఘాతుకం జరిగినట్లు తెలుస్తోంది. యువతి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్దారించుకున్న తర్వాత నిందితుడు కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అసలు ఆ ఆఫీసులో ఏం జరిగింది?
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలిలోని ఓ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఆఫీస్. ఇక్కడ ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి.. ఓ యువతిపై దాడి చేశాడు. ఆఫీసులో ఆ యువతి తన డెస్క్ వద్ద కూర్చొని ఎంతో నిమగ్నమై పని చేసుకుంటోంది. ఆమె ఏ మాత్రం ఊహించని విధంగా వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు. మొదటి ఆ వ్యక్తి దాడి చేయగానే దిగ్భ్రాంతికి గురైన ఆ యువతి.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆఫీస్ లోపల పరిగెత్తేందుకు ప్రయత్నించింది. కానీ ఉన్మాదిలా మారిన అతడు ఆమెను వదలకుండా వెంటాడి ఆఫీస్ మెయిన్ డోర్ వద్దకు రాగానే ఆమె జట్టు పట్టుకుని కిందకు ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఆపై ఏమాత్రం దయలేకుండా విచక్షణారహితంగా కత్తితో పొడిచేశాడు…
Also Read
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
ఈ ఘోరాన్ని కళ్లారా చూసిన ఆఫీస్‌లోని ఇతర సహోద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడ ఉన్న ఉద్యోగులు ధైర్యం చేసి నిందితుడిని పట్టుకుని ఆ యువతిని కాపాడేందుకు గట్టిగానే ప్రయత్నించారు. అయితే చేతిలో పదునైన కత్తితో రక్తసిక్తమై ఉన్న నిందితుడు వారిపైకి కూడా తిరగబడటంతో వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. యువతి కిందపడిపోయి ఒళ్లంతా రక్తమయమై కదలికలు లేకుండా పోయేంతవరకు నిందితుడు ఆమె శరీరంలో విచక్షణారహితంగా 20 సార్లకు పైగా కత్తితో దాడి చేశాడు.
బాధితురాలు డింపుల్ మరణించిందని భావించిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించలేదు. నేరుగా డింపుల్ మొదట కూర్చుని ఉన్న డెస్క్ గదిలోకి వెళ్లాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న కత్తితో తన సొంత గొంతుపై అత్యంత క్రూరంగా పొడుచుకోవడం ప్రారంభించాడు. అలా తన గొంతుపై దాదాపు 30 సార్లకు పైగా కత్తితో పొడుచుకుంటూ ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ భయానక దృశ్యాలను చూసి హడలిపోయిన తోటి సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరినీ తక్షణమే సమీపంలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితుడు హ్యారీ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనలో దాడికి గురైన యువతి పేరు డింపుల్, దాడి చేసిన యువకుడి పేరు హ్యారీ. ఇద్దరూ పటియాలా ప్రాంతానికి చెందిన నివాసితులు. వారు మొహాలీలోని ఒక ప్రైవేట్ ‘ప్యాకర్స్ అండ్ మూవర్స్’ కంపెనీలో గత మూడేళ్లుగా కలిసి ఉద్యోగం చేస్తున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో వారి మధ్య మొదట స్నేహం ఏర్పడి.. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. అయితే వీరి రిలేషన్షిప్లో కొన్ని గొడవలు రావడంతో కొంతకాలం క్రితమే ఇద్దరూ విడిపోయారు. కానీ నిందితుడు హ్యారీ మాత్రం ఆ బ్రేకప్ను జీర్ణించుకోలేకపోయాడు. మళ్లీ డింపుల్‌తో పాత సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలని నిరంతరం ఒత్తిడి తెచ్చేవాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర మానసిక వేదనకు, కోపానికి గురయ్యాడు. గురువారం కూడా ఇదే విషయంపై ఆఫీసులో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగిందని, ఆ కక్షతోనే హ్యారీ ఈ ఘాతుకానికి ప్లాన్ చేశాడని తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మొహాలీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆఫీస్ ఆవరణను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హత్య జరిగిన తీరును, మోటివ్ను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలం నుంచి రక్తం నమూనాలు, నిందితుడు వాడిన కత్తితో పాటు ఇతర కీలక భౌతిక ఆధారాలను సేకరించింది. ఈ ఘోర ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇటు బాధితురాలి, అటు నిందితుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారిద్దరి కాల్ డేటా, చాటింగ్స్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?