Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- ఇండియాకు గుడ్ న్యూస్..
- అండమాన్ సముద్రంలో గ్యాస్ నిల్వల ఉనికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Natural gas: ఇంధన రంగంలో భారత్‌కు ఇది భారీ శుభవార్త. అండమాన్ సముద్రంలో సహజ వాయువు(నేచురల్ గ్యాస్) నిల్వల్ని ఆయిల్ ఇండియా లిమిటెడ్(OIL) గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో 355 మీటర్ల నీటి లోతులో ఉన్న ‘‘శ్రీ విజయపురం-3’’ బావిలో ఈ గ్యాస్ నిల్వల్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ బావిని 1900 మీటర్లకు పైగా లోతులోని ఈయోసిన్ శిలా పొరల వరకు తవ్వారు. భూగర్భం నుంచి వచ్చిన గ్యాస్‌ను మండించడం ద్వారా సహజవాయువు ఉనికిని గుర్తించారు.
ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుత వాయువు మూలాన్ని అర్థం చేసుకోవడానికి ఐసోటోప్ అధ్యయనాలతో పాటు, దాని రసాయనిక స్వరూపం, కిలోరిఫిక్ వాల్యూ తెలుసుకోవడానికి అధ్యయనాలు నిర్వహిస్తోంది. భారతదేశ తీర ప్రాంతాల్లో, అత్యంత లోతైన జనాల్లో అన్వేషన చేయడానికి కేంద్రం ప్రకటించిన ‘‘సముద్ర మంథన్ మిషన్’’లో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది.
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ప్రస్తుతం, అండమాన్ బేసిన్లో ఆయిల్ ఇండియా తవ్విన మూడు బావుల్లో రెండింటిలో హైడ్రోకార్బన్లను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అండమాన్‌లో దొరికిన ఈ గ్యాస్ భారత ఇంధన భద్రతకు కీలక ప్రదేశం మారే అవకాశాలు ఉన్నాయి. భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ తో పాటు ఇతర దేశాలపై ఆధారపడుతోంది. ఈ ప్రాంతాల్లో ఏదైనా సంక్షోభం నెలకొంటే, దేశంలో ఇంధన ధరలు పెరగడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం, ఇరాన్ యుద్ధం వల్ల భారత్ ఇంధన రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Congratulations @OilIndiaLimited !
An ocean of energy opportunities reinforced in the Andaman Sea!
Very happy to report the presence of natural gas in Sri Vijayapuram-3 an exploratory well drilled by Oil India Ltd. 15 km off the east coast of the Andaman Islands at a water… pic.twitter.com/j6QvWqZkFx— Hardeep Singh Puri (@HardeepSPuri) June 5, 2026
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..