Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- వివాహేతర సంబంధాలతో కుటుంబాల్లో చిచ్చు
- అర్ధాంతరంగా ముగుస్తున్న జీవితాలు
- తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ధిక సమస్యలు.. వివాహేతర బంధాలు.. మద్యం.. అదనపు కట్నం.. కారణమేదైనా కావచ్చు… కాపురాల్లో కసి రేగుతోంది. భార్యను భర్త..లేదా భర్తను భార్య అత్యంత దారుణంగా చంపేసే ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
అనుమానాలు.. వివాహేతర బంధాలు.. ఆర్ధిక సమస్యలు.. కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. వీటి వల్ల పచ్చని కాపురాలు కుప్పకూలిపోతున్నాయి. హైదరాబాద్ అత్తాపూర్‌లో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. దాన్ని నిలదీసిన పాపానికి భార్యను దారుణంగా చంపేశాడు.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్వి నగర్ కాలనీలో భార్యపై అనుమానంతో మద్యం మత్తులో ఓ భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. కత్తి, ఇనుప రాడ్‌తో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
మహిళ పేరు కోమలి. ఆమె భర్త అవినాష్, పిల్లలతో కలిసి అత్తాపూర్‌లో నివాసం ఉంటోంది. ఎక్కడో నాందేడ్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. ఐతే భర్త అవినాష్ ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడు. దీంతో భర్తను తాగుడు మానేయమని కోరింది కోమల. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, ఇంట్లోని కూరగాయలు కోసే కత్తి, ఇనుప రాడ్‌తో భార్య కోమలిపై దాడి చేశాడు. భార్య అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మరోవైపు పోలీసులు.. క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. అటు నిందితుడు అవినాష్.. పోలీసులకు లొంగిపోయాడు. తల్లి చనిపోవడం.. తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాథలయ్యారు.
శ్రీకాకుళంలోనూ ఇలాంటి ఘోరమే ఒకటి వెలుగుచూసింది. తాగి వచ్చి డబ్బుల కోసం వేధిస్తున్నాడనే కోపంతో.. కట్టుకున్న భర్తను కత్తిపీటతో నరికి చంపేసింది ఓ భార్య. ఈ ఘాతుకంతో ప్రకాష్ నగర్ ఏరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీకాకుళంలోని ప్రకాష్ నగర్, గాజుల వీధికి చెందిన ధర్మాన అసిరినాయుడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య జయలక్ష్మి, మణికంఠ అనే కుమారుడు ఉన్నారు. అసిరినాయుడుకి తీవ్రమైన తాగుడు అలవాటు ఉంది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడటం అతనికి నిత్యకృత్యంగా మారింది.
ఈ క్రమంలోనే అసిరినాయుడు బాగా తాగి ఇంటికి వచ్చాడు. అదనంగా డబ్బులు కావాలంటూ భార్య జయలక్ష్మితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. భర్త నిత్య వేధింపులతో తీవ్ర విసుగు చెందిన.. భార్య జయలక్ష్మి.. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తిపీటను తీసుకుని భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాలు కావడంతో అసిరినాయుడు అక్కడికక్కడే రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోయాడు. అసిరినాయుడు కుమారుడు మణికంఠ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో విధులను ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తండ్రి విగతజీవిగా పడి ఉండటం చూసి షాకయ్యాడు. అసలేం జరిగిందని తల్లి జయలక్ష్మిని ప్రశ్నించగా.. తామిద్దరం గొడవ పడ్డామని, ఆ క్రమంలోనే అతను కిందపడిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తండ్రి మృతిపై అనుమానం వచ్చిన కుమారుడు మణికంఠ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
శ్రీకాకుళం పోలీసులు.. క్లూస్ టీమ్‌తోపాటు స్పాట్‌కు చేరుకుని ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించారు. కుమారుడు మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త హత్యకు పాల్పడిన భార్య జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు…
కర్ణాటకలోని కోలారు జిల్లాలో గుండెల్ని పిండేసే దారుణ ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక, జీవితంపై ఆశ కోల్పోయి ఇద్దరు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. ఈ విషాద ఘటన కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా చింతలహళ్లి జోడి గ్రామంలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా సోమల గ్రామానికి చెందిన బుజ్జి, బాబు దంపతులు కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం కర్ణాటకలోని కోలారు జిల్లాకు వలస వచ్చారు. అక్కడ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి కూతురు సరస్వతి, కుమారుడు హేమశ్రీ ఉన్నారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో ఆ కుటుంబంలో పెద్ద విషాదం నెలకొంది. మే 10న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భర్త బాబు మృతి చెందాడు. కట్టుకున్న భర్త హఠాన్మరణంతో భార్య బుజ్జి తీవ్ర మనస్తాపానికి గురైంది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని వెళ్లదీయడం భారంగా భావించింది. భర్త లేని జీవితంపై భరోసా కోల్పోయిన బుజ్జి, పిల్లలతో సహా చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కన్నకూతురు సరస్వతి, పసికందు హేమశ్రీలకు ఊపిరి ఆడకుండా చేసి మంచంపైనే చంపేసింది.
బిడ్డలిద్దరూ చనిపోయాక.. బుజ్జి కూడా ఇంట్లోనే ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే గమనించిన స్థానికులు వెంటనే లోపలికి వెళ్లి ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్న పిల్లలను చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న నంగలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, నిందితురాలు బుజ్జిని అదుపులోకి తీసుకున్నారు. భర్త చనిపోయిన నెల రోజులకే ఇద్దరు పసిబిడ్డలు కూడా తల్లి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!