పరిపాలనలో ఎంత బిజీగా ఉన్నా సాయం అందించే విషయంలో మాత్రం జగన్ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. తిరువూరు పర్యటనలో జగన్ చిన్నారుల వైద్యానికి సాయం అందించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పిల్లల వైద్య సహాయం కల నెరవేరింది. ఎలాగైనా సీఎంని కలవాలని భావించిన చిన్నారుల తల్లిదండ్రుల ఆశ నెరవేరింది. భరోసా ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్ పేట గ్రామంలో నివాసం ఉంటూ రంగులపని చేసే గాదే సురేష్ – గాయత్రి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో ఇద్దరు వేదశ్రీ దుర్గ (12) లాస్య ప్రియ(8) పుట్టుకతోనే అంతు పట్టని వ్యాధితో (కంజెనిటికల్ మైస్తేనియా సిండ్రోమ్) బాధపడుతున్నారు. అయితే వైద్యం కోసం ఖమ్మం, విజయవాడలో ఎన్నో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ లో తిరిగిన సరైన వైద్యం దొరకట్లేదు. వేలకు వేలు ఖర్చుపెట్టడం ఆ దంపతులకు భారంగా మారింది.
Read Also: Akhilesh Yadav: కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది.. అఖిలేష్ వార్నింగ్..
తరువాత రెయిన్ బో హాస్పటల్లో చూపిస్తే.. వెయ్యి మందిలో ఒకరికి ఇలాంటి వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి నిర్మూలన లేదు కానీ మెడిసిన్ ద్వారా వారిని కంట్రోల్ చేయవచ్చు అని వైద్యులు తెలపగా ఆ వైద్యానికి మందులు పౌడర్ ఇంజక్షన్ వంటి వాటికి నెలకి ఇద్దరు మీద 30 నుంచి 40 వేలు అవుతున్నాయి ఈ ఆర్థిక భారం పెరగటం వల్ల శ్రీ సామినేని ఉదయభాను గారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్ళారు. తమ పిల్లల్ని ఆదుకోవాలని వారు సీఎంని కోరారు. తక్షణం స్పందించి వైద్య సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. సీఎం స్పందనకు ధన్యవాదాలు తెలిపారు ఆ తల్లిదండ్రులు.
Read Also: Health: కోడళ్ల అనారోగ్యానికి అత్తలే కారణమట