రేపు సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా రేపు సీఎం జగన్ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉదయం 10.55 గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.15 గంటలకు కైలాసపురం పోర్టు ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. అక్కడ ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టనున్న 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Also Read : Cessna 177: సముద్రంలో ల్యాండ్ అయిన విమానం.. కారణమిదే.. చివరికి ఏమైంది?
ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి సిరిపురం కూడలిలోని ఏయూ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్, బయో మోనిటరింగ్ హబ్‌తో పాటు మరో నాలుగు భవనాలను ప్రారంభిస్తారు. 12.50 గంటలకు ఏయూ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత 1.20 గంటలకు కన్వెన్షన్ సెంటర్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.50 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు.
Also Read : Remi Lucidi: విషాదాంతంగా ముగిసిన సాహస యాత్రికుడి ప్రయాణం.. 68వ అంతస్తు నుంచి పడి..