Cessna 177 Flight Landed On Sea Due To Engine Failure: విమానం గాల్లో ఉన్నప్పుడు ఇంజిన్ ఫెయిల్ అవ్వడంతో.. మరో దారి లేక పైలట్ దాన్ని ఒక సముద్రంపై ల్యాండ్ చేశాడు. హమ్మయ్యా అని అనుకునేలోపే.. ఆ విమానం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభమైంది. అప్పుడు పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణ ఫ్రాన్స్‌లోని ఫ్రెజుస్ తీరంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో వందే భారత్ ట్రైన్.. నేడు ట్రయల్ రన్
పర్యాటకులతో నిండిన ఒక చిన్నపాటి విమానం దక్షిణ ఫ్రాన్స్‌లో గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలో.. అనుకోకుండా దాని ఇంజిన్ ఒక్కసారిగా ఫెయిల్ అయ్యింది. ఇది గమనించిన పైలట్.. ప్రయాణికుల్ని అప్రమత్తం చేశాడు. ఈ దెబ్బకు వాళ్లు భయాందోళనలకు గురయ్యారు. ఎవరూ ఆందోళన చెందొద్దని ప్యాసింజర్లలో పైలట్ భరోసా కల్పిస్తూ.. విమానాన్ని బీచ్ వద్ద ల్యాండ్ చేయాలని అనుకున్నాడు. అయితే.. బీచ్ వద్ద ప్రయాణికులు ఉన్న విషయాన్ని గమనించి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. బీచ్‌కి కొంత దూరంలో సముద్రంలో ల్యాండ్ చేయడమే శ్రేయస్కరమని భావించి, ఈ ప్లాన్ అమలు చేశాడు.
Mumbai Indians: నికోలస్ పూరన్ విధ్వసం.. టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్!
విమానాన్ని సముద్రంపై ల్యాండ్ చేయడానికి ముందే.. ఇంజిన్ ఫెయిల్ అయ్యిందన్న విషయాన్ని పైలట్ అధికారులకు తెలియజేశాడు. అనంతరం.. బీచ్‌కి 600 మీటర్ల దూరంలో విమానాన్ని సముద్రంలోనే చాకచక్యంగా కిందకు దించాడు. విమానం ల్యాండ్ అవ్వగానే.. బీచ్ రెస్క్యూ టీం రంగంలోకి దిగి, అందులో ఉన్న పర్యాటకుల్ని సురక్షితంగా కాపాడారు. ఇటువంటి క్లిష్టమైన పనిని పూర్తి చేయాలంటే.. ఎంతో నేర్పుతో పాటు అదృష్టం కూడా ఉండాలని ఓ అధికారి పేర్కొన్నారు. మరోవైపు.. ఆ విమానం సముద్రంలో మునిగిపోయింది.